Cyber Security : మైక్రోసాఫ్ట్ నుంచి మీకో బంఫర్ ఆఫర్..! లక్ష మందికి పైగా..
Sakshi Education
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ సెక్యూరిటీను కెరియర్‌గా ఎంచుకునే వారికోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక శిక్షణా ప్రోగ్రాంను ఆవిష్కరించింది.
క్లౌడ్‌హ్యాట్, కీనిగ్, ఆర్‌పీఎస్, సినర్జిటిక్స్ లెర్నింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది. ఈ ప్రోగ్రాం కింద 2022 నాటికి లక్ష మందికి పైగా శిక్షణనివ్వాలని భావిస్తోంది. నైపుణ్యాల విషయంలో అన్ని స్థాయిల వారికి అనువుగా ఉండే విధంగా కోర్సు మాడ్యూల్స్‌ను రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. దీనికి సంబంధించిన అనుబంధ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఫండమెంటల్స్‌లో సర్టిఫికేషన్‌ను ఉచితంగా అందిం చనున్నట్లు పేర్కొన్నారు.
Published date : 08 Dec 2021 05:18PM