PM Vishwakarma Yojana Scheme: హస్తకళా నైపుణ్యంపై ఇచ్చే శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education

నరసరావుపేట: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద చేతివృత్తుల వారు హస్తకళా నైపుణ్యంపై ఇచ్చే శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారి పి.వెంకటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం ఈ ఏడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. శిక్షణ తర్వాత ఉపకరణాల కొనుగోలుకు రూ.15వేలు ఆర్థిక సహాయం చేస్తారన్నారు. హస్తకళాకారులు మొదటి దఫా కింద రూ.లక్ష వరకు సబ్సిడీ వడ్డీరేటుతో రుణ సదుపాయం పొందవచ్చన్నారు. రెండో దఫా రూ.2లక్షల వరకు రుణం ఇస్తారన్నారు. అర్హులైన అభ్యర్థులు మొబైల్ నంబరు అనుసంధానం చేసిన ఆధార్‌కార్డు నకలు, రేషన్‌కార్డు, బ్యాంకు పుస్తకాల నకలుతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 29 Nov 2023 04:23PM