Skip to main content

VVIT: వీవీఐటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ శిక్షణ

అమెజాన్ సర్వీసెస్‌ ద్వారా అందించే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ శిక్షణ తరగతులకు దేశవ్యాప్తంగా 21 యూనివర్సిటీలు, కళాశాలలను ఎంపిక చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో వీవీఐటీ మాత్రమే ఎంపికైందని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు.
VVIT
వీవీఐటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ శిక్షణ

నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. గతంలో ఎంపికైన 7 విద్యా సంస్థలతో కలిపి దేశవ్యాప్తంగా కేవలం 28 విద్యాసంస్థలలో వీవీఐటీ ఒకటి కావడం హర్షణీయమన్నారు. అమెజాన్ వెబ్‌ సరీ్వసెస్‌ శిక్షణ ద్వారా కళాశాల నుంచి 25 మంది అధ్యాపకులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంశాలతో పాటు డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌ అంశాల్లో అమెజాన్ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.

Published date : 20 Sep 2021 02:55PM

Photo Stories