NIT-Andhra Pradesh: ఏపీ నిట్ విద్యార్థికి పవర్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం
తాడేపల్లిగూడెం: ఆలిండియా ఇంటర్ ఎన్‌ఐటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థి టి.మంజునాఽథ్ కాంస్య పతకాన్ని సాధించినట్లు నిట్ అధికారులు నవంబర్ 11 శనివారం సాయంత్రం తెలిపారు. పశ్చిమబెంగాల్ దుర్గాపూర్‌లోని నిట్‌లో నవంబర్ మూడో తేదీ నుంచి ఆరోతేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో దేశంలోని 28 మంది నిట్ క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థి మంజునాఽఽథ్ ఈ పోటీల్లో పాల్గొని వంద ప్లస్ విభాగంలో, పవర్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపర్చి కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారన్నారు. మంజునాథ్‌కు జిమ్‌ట్రైనీగా ఎం.సూర్యప్రకాష్ వ్యవహరించారు. ఏపీ నిట్ ఖ్యాతిని జాతీయస్ధాయిలో ఇనుమడింపచేసిన మంజునాఽథ్‌ను నిట్ రిజిస్ట్రార్ దినేష్ పి.శంకరరెడ్డి శనివారం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి పతకాలను సాధించడం ఆనందంగా ఉందన్నారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ వీరేష్‌కుమార్, సాస్ ఫ్యాకల్టీ కిరణ్ తీపర్తి, వి.సందీప్, కిరణ్‌కుమార్, యువరాజు, సంధ్యారాణి పాల్గొన్నారు.
చదవండి: ICC Men's Cricket World Cup 2023: వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా