Degree Exams: డిగ్రీ పరీక్షల్లో 445 మంది గైర్హాజరు
Sakshi Education
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరిగిన డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షకు 445 మంది విద్యార్థుల గైర్హాజరయ్యారని వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ఆచార్య నాగస్వరం నరసింహులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా ఉదయం సెషన్‌లో జరిగిన ఒకటవ సెమిస్టర్ పరీక్షకు 3,830 మందికి గాను 3,385 మంది హాజరు కాగా 445 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. చూచిరాతలకు పాల్పడిన కర్నూలు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాలలో ఐదుగురు, కర్నూలు ఆర్‌సీ రెడ్డి డిగ్రీ కళాశాలలో ముగ్గురు, ఎమ్మిగనూరు ఎస్‌ఎమ్‌ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, పత్తికొండ విజయసాయి డిగ్రీ కళాశాల, కర్నూలు సెయింట్ జోసప్స్ డిగ్రీ కళాశాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
Published date : 12 Jan 2024 02:50PM