Skip to main content

Inter Supply Exams 2024 Dates Changed: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఇటీవ‌లే తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ పరీక్ష‌ల ఫ‌లితాలను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఫ‌లితాల‌తో పాటు ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డ్‌ విడుదల చేసింది.
TS Inter Supply Exams New Dates 2024

అయితే తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన నూతన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.
ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపుకు అవకాశం కలదు. మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 ను నిర్వహించనున్నారు. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో..

ముందుగా 2024 మే 24 నుంచి జూన్ 1 వరకు ఉన్న పరీక్షల తేదీలను..  మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల తేదీలను మార్చింది బోర్డు.  మే 27న  నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది.  ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షలు ఒకే రోజున  నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్స్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది. 

☛ Anugnya Scored 993/1000 Marks in TS Inter : టీఎస్ ఇంటర్‌లో 993/1000 మార్కులు.. సెకండియర్ టాప‌ర్ ఈమె.. ఎలా అంటే..?

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు ప్రకటించింది. మార్కుల జాబితాను ఏప్రిల్ 25న‌ సాయంత్రం నుంచే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. మార్కులపై సందేహాలుంటే 10 రోజుల్లోగా తమకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం పేపర్‌కు రూ. 600 చెల్లించి గురువారం నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

చ‌ద‌వండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

టీఎస్ ఇంట‌ర్ నూతన షెడ్యూల్ ఇదే..

☛ మే–24 : SECOND LANGUAGE –I & II
☛ మే–25 : ENGLISH–I & II
☛ మే–28 : MATHS– A/BOT/CIVICS-I & II
☛ మే–29 : MATHS– B/ZOO/HIST –I & II
☛ మే–30 : PHYSICS/ECONOMICS –I & II
☛ మే–31  : CHEMISTRY/ OMMERCE –I & II
☛ జూన్–01 : PUB.ADMN./BRIDGE COURSE MATHS –I & II
☛ జూన్– 03 : MODERN LANGUAGE /GEOGRAPHY –I & II

☛ జూన్ 4వ తేదీ నుంచి 8 వరకు సప్లిమెంటరీ ప్రాక్టీకల్ పరీక్షలు
☛ జూన్ 10వ తేదీ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు
☛ జూన్ 11వ తేదీ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
☛ జూన్ 12వ తేదీ ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూస్ పరీక్ష

☛ Venkata Naga Sai Manasvi Scored 599/600 Marks : ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో ఈ విద్యార్థికి 599/600 మార్కులు వ‌చ్చాయ్‌.. ఎలా అంటే..?

Published date : 02 May 2024 06:26PM

Photo Stories