Skip to main content

TS Inter Results 2023: ఇదేం చోద్యం... టెన్త్‌లో టాపర్.. ఇంటర్‌‌లో అన్నీ కలిపి 13 మార్కులే!

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. కొంత‌మంది అద‌ర‌గొడితే మ‌రికొంత‌మంది మార్కులు సాధించ‌డంలో కాస్త వెన‌క‌బ‌డ్డారు. అయితే కొన్ని చోట్ల మాత్రం చిత్ర‌విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ప‌దో త‌ర‌గ‌తిలో డిస్టింక్ష‌న్‌లో పాసైన విద్యార్థులు ఇంట‌ర్‌లో క‌నీస మార్కులు తెచ్చుకోలేక‌పోయారు.
TS Inter Results 2023
TS Inter Results 2023

నిర్మ‌ల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి టెన్త్‌లో ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌య్యాడు. కానీ, ఇటీవ‌ల వెలువ‌డిన ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో అత‌నికి వ‌చ్చిన మార్కులు రెండు డిజిట్లు దాట‌లేదు. ఆ వివ‌రాలేంటో ఇక్క‌డ తెలుసుకుందాం. 

చ‌ద‌వండి: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

students

నిర్మల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి త‌న ఫ‌లితాల‌ను చూసి అవాక్క‌య్యాడు. మంగ‌ళ‌వారం(మే 9వ తేదీ) వెలువడిన ఇంటర్ ఫలితాల్లో త‌న‌కు వ‌చ్చిన మార్కుల‌ను చూసి షాక్‌కు గుర‌య్యాడు. పదో తరగతిలో మంచి మార్కులతో పాసై ఇంట‌ర్‌లో ఎంపీసీలో చేరాడు. ఏప్రిల్‌లో జ‌రిగిన ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఉత్సాహంగా రాశాడు.

చ‌ద‌వండి: 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

students

మంచి మార్కులు వ‌స్తాయ‌ని ఇంట్లో వారితో పాటు స్నేహితుల‌కు చెప్పుకున్నాడు. కానీ, ఫ‌లితాల‌ను చూసి అవాక్క‌వ్వ‌డం అంద‌రి వంతైంది. మొత్తం 470 మార్కులకు గాను అన్ని సబ్జెక్టులలో కలిపి ఆ విద్యార్థి కేవలం 13 మార్కులే స్కోర్ చేశాడు. ఈ మార్కులు చూసిన కళాశాల యాజమాన్యానికి దిమ్మతిరిగింది.

telangana

☛ Inspiration: శ‌భాష్ అమ్మా... డిజిటల్‌ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించిన దివ్యాంగ అమ్మాయిలు

మొత్తం 13 మార్కులే రావడం చూసి కళాశాల లెక్చరర్లు అవాక్కయ్యారు. ఆ విద్యార్థి మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా మళ్లీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తానని చెబుతున్నాడు. తెలుగులో 2, ఇంగ్లీషులో 8, మ్యాథ్స్ A లో 1, ఫిజిక్స్‌లో 2 రాగా... మ్యాథ్స్ B, కెమిస్ట్రీ లో సున్నా చొప్పున మార్కులు వచ్చాయి. పరీక్షలకు హాజరు కాని విద్యార్థులను ఎందరినో చూశాం కానీ, పరీక్షలు రాసి కేవలం 13 మార్కులు మాత్రమే తెచ్చుకున్న విద్యార్థిని తొలిసారిగా చూస్తున్నామని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. 

Published date : 12 May 2023 01:13PM

Photo Stories