Skip to main content

Lok Sabha Elections 2024: పది రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీ, తెలంగాణలో బరిలో ఉన్న‌అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..

నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలకు మే 13వ తేదీ పోలింగ్‌ జరుగనుంది.
Telugu States Election Polling Date  Lok Sabha 4th Phase Candidates Full List In Ten States  Lok Sabha Election Phase 4 Polling Date

ఇక, నాలుగో విడతలో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది.

ఇక, పదో విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల బరిలో ఏపీలో మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరుగనుంది.

ఇక, నాలుగో విడతలో మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇలా..  

➤ బీహార్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీ
➤ జమ్మూ కాశ్మీర్‌లో ఒక్క పార్లమెంటు స్థానానికి బరిలో 24 మంది
➤ జార్ఖండ్‌లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీ
➤ మధ్యప్రదేశ్‌లో ఎనిమిది పార్లమెంటు స్థానాలకు 74 మంది పోటీ

EVM-VVPAT Case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

➤ మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు జరగనున్న బరిలో 209 మంది
➤ ఒడిశాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు  బరిలో 37 మంది
➤ ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలకు బరిలో 130 మంది
➤ వెస్ట్ బెంగాల్‌లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు 75 మంది.

Published date : 04 May 2024 11:12AM

Photo Stories