Skip to main content

Admissions in TSWREIS: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

Admission Alert   Telangana Social Welfare Gurukula Society   Apply for CVOE Admissions  TSWREIS Inter 1st Year Admission 2024   Telangana Social Welfare Gurukula Society Vocational Colleges

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ (సీవోఈ) కళాశాలల్లో 2024–25కు గాను ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 ప్రతిభ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 15వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రతిభా కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్‌, ఎంసెట్‌, సీఎంఏ, క్లాట్‌ ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణనిస్తారు. పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు www.tswreis.ac.in ను సందర్శించవచ్చు.

  • రాష్ట్రంలోని 38 ప్రతిభ కళాశాలల్లో బాలురకు 1,680, బాలికలకు 2,000, మొత్తం 3,680 సీట్లు ఉన్నాయి.
  • రెండంచెల పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము రూ.200, తుదిగడువు 15–01–2024.
  • మొదటి స్క్రీనింగ్‌ పరీక్ష : 04–02–2024.
  • రెండవ స్క్రీనింగ్‌ పరీక్ష : 25–02–2024
  • సిలబస్‌ : 8 నుంచి 10వ తరగతి వరకు గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌

ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాల

చదవండి: Inter Study Material

Published date : 10 Jan 2024 12:14PM

Photo Stories