Skip to main content

Real Life Sir Story : సినిమాలో 'సార్‌'..ధ‌నుష్ అయితే..రియ‌ల్ లైఫ్‌లో..ఈ 'సారే'..| ఈయ‌న స్టోరీకి ఫిదా అవాల్సిందే..

అచ్చం హీరో ధ‌నుష్ న‌టించిన సార్ సినిమా..  స‌రిగ్గా ఈ టీచ‌ర్ స్టోరీ ఒకేలా ఉంటాయి. అందుకేమో ‘సార్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా ఈ సార్‌ని క‌లిసి అభినందించారు. అలాగే అతి చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు కేడర్ల రంగయ్య. 13 సంవత్సరాల కాలంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళను, సాధించిన ఘనతలను గుర్తు చేసుకున్నారు రంగయ్య సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌కి ఇచ్చిన‌ ఈ ఇంట‌ర్వ్యూలో. పేద విద్యార్థుల విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్న కేడర్ల రంగయ్య మ‌నం నిజంగా అభినందించాల్సిందే . కేడర్ల రంగయ్య ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 60 మాత్రమే. కానీ తనదైన కృషితో ఆ సంఖ్యను 260కి చేర్చారాయన. చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. సార్‌.. సినిమా చూస్తున్నంత సేపు తనని తాను తెరపై చూసుకున్నట్లుందని కేడర్ల రంగయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌కి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో కేడర్ల రంగయ్య త‌న‌ అభిప్రాయాలు పంచుకున్నారు ఇలా..

Photo Stories