Telangana Govt Jobs 2022 : 'ఎకానమీ'.. చదివేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
Indian Economy Imp Topics for Competitive Exams: ఇటీవల కాలంలో పోటీపరీక్షల్లో ఎంతో కీలకంగా మారుతున్న విభాగంగా ఎకానమీని పేర్కొనొచ్చు. ఈ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ–లక్షణాలు, జాతీయాదాయం, పంచవర్ష ప్రణాళికలు, పేదరికం–నిరుద్యోగం, వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, పారిశ్రామికాభివృద్ధి, సేవారంగ వృద్ధి అంశాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా తాజా ఆర్థిక విధానాలు–పారిశ్రామిక తీర్మానాలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ద్రవ్యోల్బణం, వ్యవసాయ రంగం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్‌ల గురించి సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. అదే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. సంబంధిత రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి– ఉత్పాదకత, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న తాజా ఆర్థిక విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ పరపతి,సేవారంగ ప్రాధాన్యం, ప్రాంతీయ అసమానతలు అంశాలపై శ్రద్ధ వహించాలి. ఇంకా పై వీడియో ద్వారా మీకు కావాల్సిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చును.