Skip to main content

TSPSC Group 2 Exams New Schedule 2024 : TSPSC గ్రూప్‌-2 కొత్త ప‌రీక్షల‌ తేదీలు ఇవేనా..?

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-2 మ‌ళ్లీ వాయిదా వేసింది. జ‌న‌వ‌రి 6, 7వ తేదీల్లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ డిసెంబ‌ర్ 27వ తేదీన‌(బుధ‌వారం) ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. దాదాపు 783 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు గ‌తంలో నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల‌కు దాదాపు 5.5 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి.. కొత్త‌గా నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చే అవ‌కాశం ఉందంటున్నారు.. అలాగే ఈ సిల‌బ‌స్‌లో మార్పులు చేర్పులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది అంటున్నారు.. TPCC అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ రియాజ్ గారు. ఈ నేప‌థ్యంలో TPCC అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ రియాజ్ గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ మీకోసం..

Photo Stories