UPSC Civil Service Notification Details 2023 : ఈ సారి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ విధానంలో..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 1వ తేదీన (బుధవారం) విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కు సంబంధించిన సిలబస్, పరీక్షావిధానం, పోస్టుల వివరాలు మొదలైన అంశాల గురించి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు, CSB IAS ACADEMY Director బాలలత గారిచే సాక్షి ఎడ్యుకేషన్.కామ్ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ మీకోసం..