1,365 Jobs: గ్రూప్–3లో కొలువులు.. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇవే..
26 ప్రభుత్వ విభాగాల్లో 1,365 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. నెలపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఫిబ్రవరి 23ను గడువుగా నిర్దేశించింది. ప్రస్తుతం వెబ్‌నోట్ ద్వారా గ్రూప్–3 ఖాళీల వివరాలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ... జనవరి 24న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. తాజాగా జారీ చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 1,365 ఉద్యోగ ఖాళీలుండగా... ఇందులో సగానికిపైగా ఆర్థిక శాఖలకు సంబంధించిన ఉద్యోగాలే ఉన్నా యి. డిసెంబర్ ఒకటిన గ్రూప్–4 ప్రకటన జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ వరుసగా నెలాఖరు నాటికి గ్రూప్–2, గ్రూప్–3 ప్రకటనలు జారీ చేసి రికార్డు సృష్టించింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
కొత్త కేడర్ల చేరికతో...
రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు గ్రూప్–2, గ్రూప్–3 హోదా ఇచి్చంది. ఈ క్రమంలో పలు కేడర్‌లు గ్రూప్–2, గ్రూప్–3లోకి చేరడంతో పోస్టుల సంఖ్య కూడా పెరిగింది. గ్రూప్–3 కేటగిరీలో భర్తీకానున్న పోస్టుల్లో సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. అత్యధికంగా ఆర్థికశాఖ పరిధిలో 712 పోస్టు లుండగా అందులో పే అండ్ అకౌంట్స్ హెచ్‌ఓడీలో 126 సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెచ్‌ఓడీలో 140, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (జోనల్) హెచ్‌ఓడీలో 248, స్టేట్ ఆడిట్ హెచ్‌ఓడీలో 61 సీనియర్ అకౌంటెంట్ పోస్టులున్నాయి.
శాఖ పేరు |
పోస్టులు |
వ్యవసాయ–సహకార శాఖ |
27 |
పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ |
02 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం |
27 |
విద్యుత్ శాఖ |
02 |
పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతికం |
07 |
ఆర్థిక శాఖ |
712 |
ఆహార, పౌర సరఫరాలు |
16 |
సాధారణ పరిపాలన విభాగం |
46 |
ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం |
39 |
ఉన్నత విద్య |
89 |
హోం శాఖ |
70 |
పరిశ్రమలు, వాణిజ్యం |
25 |
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగం |
01 |
కారి్మక, ఉపాధి కల్పన |
33 |
మైనారిటీ సంక్షేమ శాఖ |
06 |
పురపాలన, పట్టణాభివృద్ధి |
18 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి |
29 |
ప్రణాళిక |
03 |
రెవెన్యూ |
73 |
ఎస్సీ అభివృద్ధి |
36 |
మాధ్యమిక విద్య |
56 |
రవాణా, రోడ్లు, భవనాలు |
12 |
గిరిజన సంక్షేమం |
27 |
మహిళ, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం |
03 |
యువజన సరీ్వసులు, పర్యాటక, సాంస్కృతికం |
05 |
గిరిజన సంక్షేమం (ట్రైకార్) |
01 |
మొత్తం |
1,365 |