Skip to main content

త్వరలోనే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ కానున్న ఉద్యోగాలు...?

సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది.
ఒకటీ రెండు నెలల్లో 50 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను డిసెంబర్ 13వ తేదీన సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇపుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్లైంది. వీరంతా సీరియస్‌గా ప్రిపరేషన్‌లో మునిగిపోనున్నారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్-1,2,3&4 ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ ద్వారా భ ర్తీ కానున్న పోస్టులు...?
తెలంగాణలో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించిన క్లియరెన్స్లు లభించకపోవడంతో అన్నింటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో 36,758 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టుల భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్‌పీఎస్సీ గవర్నర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్-1,2,3&4 స్టడీమెటీరియల్కోసం క్లిక్ చేయండి

తాజా లెక్క తేలాలి...
రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించాక... నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్-1,2,3&4 స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, బిట్‌బ్యాంక్, ఆన్‌లైన్ టెస్టులు, ప్రిపరేషన్ గెడైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఎఫ్‌ఏక్యూస్, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి.
Published date : 14 Dec 2020 12:28PM

Photo Stories