టీఎస్‌పీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్ నోటిఫికేషన్- 2020 విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి నిర్వహించే శాఖాపరమైన పరీక్షల నోటిఫికేషన్‌ను శుక్రవారం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.
ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫీజు చెల్లింపులు కూడా ఈనెల 31లోపు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో టీఎస్‌పీఎస్సీ సూచించింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్‌లో రాయాల్సి ఉందని, 9 జిల్లాల కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వివరించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి హెచ్‌ఎండీఏ పరిధిగా గుర్తించి పరీక్షలు నిర్వహించనుంది.
Published date : 12 Dec 2020 03:33PM