స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 20న సర్టిఫికెట్ వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీలో భాగంగా 64 మంది దివ్యాంగులైన అభ్యర్థులకు ఫిబ్రవరి20న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
ఈ వెరిఫికేషన్ హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 18 Feb 2020 03:18PM