Skip to main content

ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు కాళోజీ నారాయణరావుయూనివర్సిటీ పోస్టులకు ఎడిట్ ఆప్షన్: టీఎస్‌పీఎస్సీ

సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఈ నెల 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి12 (బుధవారం)న ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బయోడేటాలో ఏవైనా తప్పులుంటే సవరించుకోవచ్చని పేర్కొంది. ఎడిట్ ఆప్షన్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. వివరాలకు అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 13 Feb 2020 01:24PM

Photo Stories