Skip to main content

పూర్తయిన ‘టీఎస్‌పీఎస్సీగ్రూప్-4’ పోస్టుల భర్తీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,595 గ్రూప్-4 పోస్టులకు సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ మంగళవారం ప్రకటించింది.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన కమిషన్ భేటీలో నిర్ణయం తీసుకుని.. వెంటనే ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 11 శాఖల్లో గ్రూప్-4 కేటగిరీలో 1,098 జూనియర్ అసిస్టెంట్, 450 టైపిస్ట్, 44 స్టెనో (ఆంగ్లం), 3 స్టెనో (తెలుగు) పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 1,090 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసింది. అభ్యర్థులు లభించని కారణంగా 8 పోస్టులను భర్తీ చేయలేదు. కోర్టు కేసుల కారణంగా అందులో నలుగురి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టింది. 425 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయగా, కోర్టు కేసు కారణంగా ఒకరి ఫలితాన్ని విత్‌హెల్డ్‌లో పెట్టింది. అభ్యర్థులు లేని కారణంగా 25 పోస్టులను భర్తీ చేయలేదు. 39 స్టెనో(ఆంగ్లం) పోస్టులను భర్తీ చేయగా.. అభ్యర్థులు లేని కారణంగా 5 పోస్టులను భర్తీ చేయలేదు. అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా 3 స్టెనో (తెలుగు) పోస్టులను భర్తీ చేయలేదు. వీటితోపాటే జీహెచ్‌ఎంసీలో 124 బిల్ కలెక్టర్, బేవరేజెస్ కార్పొరేషన్ లో 76, టీఎస్‌ఆర్టీసీలో 72... కలిపి మొత్తంగా 1,867 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో గ్రూప్-4 కోసం 4,35,389 మంది, బేవరేజెస్ కార్పొరేషన్లో పోస్టుల కోసం 26,495 మంది, ఆర్టీసీలో పోస్టుల కోసం 50,526 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 2018, అక్టోబర్ 17న నిర్వహించిన పరీక్షకు 3,12,397 మంది హాజరయ్యారని వెల్లడించింది. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ పోస్టుల ఫలితాలను గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Published date : 07 Oct 2020 01:47PM

Photo Stories