Skip to main content

పలు పోస్టులకు ఫిబ్రవరి 16, 17న కంప్యూటర్ టెస్టులు

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో పలు పోస్టులకు ఈ నెల 16, 17 తేదీల్లో కంప్యూటర్ అప్లికేషన్స్, అకౌంట్స్‌కు సంబంధించి టెస్టులు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ టెస్టులు ఉదయం 10 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వీటికి సంబంధించిన హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొంది.
Published date : 14 Feb 2020 03:54PM

Photo Stories