నేటి నుంచి గూపు-4మూడో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గ్రూపు-4 పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మూడో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మార్చి 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంట లకు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని, ఎంపికైన వారి జాబితా తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది. మొదటి దశ, రెండో దశ, మూడో దశలో హాజరయ్యేవారికి కూడా ఈనెల 8న కంప్యూటర్ ప్రొఫిషియె న్షీ టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపింది. పోస్టు, జోన్, జిల్లా ప్రాధాన్యతలపై వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని పేర్కొంది. ప్రొఫిషియెన్షీ టెస్టు మార్కులను ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది.
Published date : 04 Mar 2020 02:48PM