జనవరి 28 నుంచి గ్రూపు-4 రెండో దశ వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గ్రూపు-4 పోస్టుల భర్తీలో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
వెరిఫికేషన్‌కు ఎంపికై న వారి జాబితాను తమ వెబ్‌సైట్ www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. వారంతా జనవరి 27 నుంచి ఫిబ్రవరి 7 వరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది.
Published date : 24 Jan 2020 01:45PM