జలమండలిలో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో (జలమండలి) 93 మేనేజర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మార్చి 7 (శనివారం)ననోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 16 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. సివిల్ ఇంజనీరింగ్‌లో 79, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 6, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 4, కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో 1, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 3 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 09 Mar 2020 12:31PM