Skip to main content

TSPSC: గ్రూప్–1 అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
TSPSC
గ్రూప్–1 అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

పరీక్ష నిర్వహణపై అక్టోబర్ 11న బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. అక్టోబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు సీఎస్ వివరించారు. స్ట్రాంగ్రూమ్లను గుర్తించి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరీక్షాకేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్రూమ్ ఇన్చార్జీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ఇచి్చన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రిలిమినరీ టెస్ట్ కోసం అభ్యర్థులు హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు చివరి నిమిషంలో కాకుండా నిరీ్ణత సమయం కంటే ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 10.15 గంటలకే గేటు మూసివేస్తారు. అభ్యర్థులను లోపలికి అనుమతించరు.
అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి. కలర్ ప్రింట్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ప్రింట్ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి. లేకుంటే ఆ అభ్యర్థిని అనుమతించరు.
పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు ముందుగా హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి.
ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమినరీ రాసేటపుడు తీసుకున్న బయోమెట్రిక్‌, మెయిన్స్‌కి వచ్చినపుడు తీసుకునే దానితో సరిపోలితేనే ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. బూట్లు వేసుకోకూడదు.
చేతులకు, కాళ్లకు గోరింటాకు, సిరా, టాటూస్‌ లాంటి అలంకరణలు ఉండకూడదు, ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు. 
ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి. పొరపాట్లు ఉంటే మరొకటి అడిగి తీసుకోవాలి.
అభ్యర్థులు ఓఎంఆర్ పత్రంలో వైట్నర్‌, చాక్ పౌడర్‌, బ్లేడ్, రబ్బరు వాడితే ఆ పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి, మూల్యాంకనానికి పరిగణించరు. 
ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టిపరిస్థితుల్లో మార్కు చేయకూడదు. ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న స్థలంలో కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా, ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.
అభ్యర్థుల ఓఎంఆర్; షీట్ల డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ ఓఎంఆర్ కాపీలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది. 
పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు.

 టీఎస్‌పీఎస్సీ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

టెస్ట్‌ బుక్‌లెట్‌లో మార్పులు...: 

గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టెస్ట్‌ బుక్‌లెట్‌ను కొత్తగా డిజైన్‌ చేసింది. ఇదివరకు టెస్ట్‌బుక్‌లెట్‌ సిరీస్‌ కోడ్‌ స్థానంలో ఏ,బీ,సీ,డీ ని రాయాల్సి ఉండేది. అలా కాకుండా పరీక్షను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు టెస్ట్‌బుక్‌లెట్‌ సిరీస్‌ స్థానంలో ఆరు అంకెల నంబర్‌ను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన బుక్‌లెట్‌ నంబర్‌ను ఓఎంఆర్‌ షీట్‌లో పూరించాల్సి ఉంటుంది. టెస్ట్‌బుక్‌లెట్‌ నంబర్‌ను ఓఎంఆర్‌ షీట్‌లో నిర్దేశించిన స్థానంలో నిర్ణీత పద్ధతిలో బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో గుర్తించే విధానాన్ని వివరణాత్మకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి అక్టోబర్‌ 9న ఒక ప్రకటనలో తెలిపారు. 

Published date : 12 Oct 2022 02:26PM

Photo Stories