TSPSC: ఒక్కో పోస్టుకు ఇంత మంది పోటీ
గత డిసెంబర్ 1న 8,180 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. మొత్తం 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఉద్యోగ ఖాళీలు భారీగా ఉండటంతో అభ్యర్థులు పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పించారు. అందిన దరఖాస్తులను బట్టి చూస్తే ఒక్కో ఉద్యోగానికి సగటున 116 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా, రిజర్వేషన్ల వారీగా పరిశీలిస్తే పోటీ అటుఇటుగా ఉండొచ్చు. జూలై 1న గ్రూప్–4 అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే చెప్పింది.