Skip to main content

High Court: గ్రూప్‌–2 అభ్యర్థులను ఇతర హాస్టళ్లకు తరలించొద్దు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులను ఇప్పుడే స్టడీ సర్కిల్‌ హాస్టల్‌ నుంచి తరలించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
High Court
గ్రూప్‌–2 అభ్యర్థులను ఇతర హాస్టళ్లకు తరలించొద్దు

ముందు అభ్యర్థులను తరలించాలని అనుకుంటున్న హాస్టళ్లలోని వసతులపై నివేదిక అందజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డెప్యూటీ డైరెక్టర్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నివేదిక అందజేసే వరకు అభ్యర్థులను స్టడీ సర్కిల్‌లోనే ఉంచాలని, ప్రస్తుతం కల్పిస్తున్న అన్ని వసతులనూ యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

అభ్యర్థులను వేరే హాస్టళ్లకు తరలించాలంటూ మే 3న డెప్యూటీ డైరెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ జే.అశ్విని సహా 50 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ ఇటీవల విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయ­మూర్తి.. విద్యార్థులను తరలించాలనుకుంటున్న హాస్టళ్లలోని వసతులపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను మే 13కు వాయిదా వేశారు.  

Published date : 09 May 2023 03:33PM

Photo Stories