Skip to main content

TSPSC: గ్రూప్‌–1 ప్రాథమిక కీ విడుదల.. 'కీ' కోసం క్లిక్ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని జూన్‌ 28న తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది.
TSPSC
గ్రూప్‌–1 ప్రాథమిక కీ విడుదల.. 'కీ' కోసం క్లిక్ చేయండి

అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈ కీని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ కీపైన ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడించవచ్చని కమిషన్‌ కార్యదర్శి జూన్ 28న‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు కమిషన్‌ నిర్దేశించిన లింకు ద్వారా అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. కేవలం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే అభ్యంతరాలను పూర్తి ఆధారాలతో ఇంగ్లిష్‌లో ఇస్తేనే స్వీకరిస్తామని, మాన్యువల్‌గా సమర్పించే వాటిని పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది.

☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper (Click Here)

☛➤ Download OMR Sheet For Group-I Prelims Exam 2023 (Click Here)

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 2,33,506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, గ్రూప్‌–1 పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ కాపీలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వీటిని వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాపీలు జూలై 27వ తేదీ వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 

Published date : 29 Jun 2023 03:18PM
PDF

Photo Stories