అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 7న ఇంటర్వ్యూ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 సర్వీసులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంటు, లా డిపార్ట్‌మెంటులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులకు మార్చి 7న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
7న ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 02 Mar 2020 02:33PM