TS TET-2022: టెట్ పరీక్ష విధానం.. ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
డీఈడీ/బీఈడీ అర్హతలుగా నిర్వహించే.. టెట్‌లో పొందిన స్కోర్.. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో.. విజయానికి కూడా దోహదం చేస్తుంది! కారణం.. టెట్ స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో.. వెయిటేజీ కల్పిస్తుండటమే! దీంతో.. టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుంది!! టీఎస్ టెట్–2022కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఒక సారి పరీక్ష విధానం, ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకుందామా..
టెట్ పరీక్ష స్వరూపం ఇలా..:
- టెట్ పేపర్–1, పేపర్–2లను 150 మార్కులు చొప్పున నిర్వహిస్తారు.
- టెట్–పేపర్–1 ఇలా: రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది. అవి..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) | 30 | 30 |
4 | గణితం | 30 | 30 |
5 | ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
- లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
- ఒకటి నుంచి అయిదో తరగతి బోధించాలనుకునే డీఈడీ, బీఈడీ అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ పేపర్–1లో అర్హత సాధించాలి.
TS TET 2022: అభ్యర్థులకు శుభవార్త.. ! ఇకపై టెట్ ఒక్కసారి రాస్తే..
టెట్ పేపర్–2 స్వరూపం :
ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్ పేపర్–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. వివరాలు..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) | 30 | 30 |
4 | సంబంధిత సబ్జెక్ట్ | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
టెట్ మోడల్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
- నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో.. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
- సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజి నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్ విభాగం నుంచి అడుగుతారు.
- సైన్స్ సబ్జెక్ట్ విషయంలో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయలాజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్ పెడగాగీ నుంచి అడుగుతారు.
- సోషల్ విభాగంలో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ల నుంచి 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
- ఈ సబ్జెక్ట్ విభాగం విషయంలో రెండు అర్హతలు ఉన్న వారు తమకు ఆసక్తి ఉన్న విభాగం పరీక్ష రాసే అవకాశం అందుబాటులో ఉంది.
- లాంగ్వేజ్–1 విభాగానికి సంబంధించి టెట్ పేపర్–1 మాదిరిగానే ఆయా లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
కనీస అర్హత మార్కులు..
రెండు పేపర్లుగా నిర్వహించే టెట్ పేపర్–1, పేపర్–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.