ప్రకటనలు - పర్యవసానాలు
- ప్రకటన ఒక సమస్య అయితే దాని పరిష్కారాలు పర్యవసానాల్లో ఉంటాయి. ఇచ్చిన సమస్యకు అనుగుణంగా అభ్యర్థి పర్యవసానాలను ఎంచుకోవాలి.
- ప్రకటనలు వివిధ రకాలుగా ఉంటాయి.
- ప్రకటనలను అభ్యర్థులు నిజమని నమ్మాలి.
- ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తే పర్యవసానం ఏది సరైందో గుర్తించడం సులువే.
మాదిరి ప్రశ్నలు
1. ప్రకటన: ఎండాకాలంలో కలుషిత నీరు తాగడం వల్ల ఏటా చాలా మంది చనిపోతున్నారు.
పర్యవసానం 1: ప్రజలందరికీ రక్షిత మంచినీటిని ప్రభుత్వం సరఫరా చేయాలి.
పర్యవసానం 2: నీటి కాలుష్యం గురించి ప్రజలకు అవగాహన ఉండి, నీటి కాలుష్యానికి దూరంగా ఉండాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
2. ప్రకటన: 2011 జనాభా లెక్కల్లో పురుష, స్త్రీ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది.
పర్యవసానం 1: ప్రభుత్వం మరోమారు జనాభా లెక్కలను సేకరించాలి.
పర్యవసానం 2: పురుష, స్త్రీ నిష్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్టమెంట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 2
3. ప్రకటన: ఈ మధ్య ఇంటర్నెట్ చౌర్యం అధికంగా జరగడంతో ఇంటర్నెట్ వినియోగదారులు భయపడుతున్నారు.
పర్యవసానం 1: ఇంటర్నెట్ చౌర్యం చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
పర్యవసానం 2: వినియోగదారులు ఇంటర్నెట్ను తక్కువగా వినియోగించాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవే
2) పర్యవసానం 1 మాత్రమే సరైంది
3) పర్యవసానం 2 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 2
4. ప్రకటన: దేశంలో మరోసారి ఉల్లిగడ్డల ధరలు పెరుగుతాయని కూరగాయల వర్తకులు ఆశిస్తున్నారు.
పర్యవసానం 1: ప్రభుత్వం ఉల్లిగడ్డలను నిల్వ ఉంచి భవిష్యత్‌లో ధరలు పెరగకుండా చూడాలి.
పర్యవసానం 2: కొరత ఉన్నప్పుడు తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవి కాదు
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం రెండోది మాత్రమే సరైంది
4) పర్యవసానం ఒకటోది మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: 2
5. ప్రకటన: సీబీఐకు వచ్చిన ఫిర్యాదులో ఒక ప్రభుత్వ అధికారి లంచం అడుగుతున్నాడని రాసి ఉంది.
పర్యవసానం 1: అధికారి లంచం తీసుకుంటుండగా సీబీఐ అతన్ని బంధించి చర్యలు తీసుకోవాలి.
పర్యవసానం 2: అధికారిపై మరిన్ని ఫిర్యాదులు వచ్చే వరకు సీబీఐ వేచి చూసి తర్వాత చర్యలు తీసుకోవాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవే
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 1
6. ప్రకటన: రైలు పట్టాలు తప్పడం వల్ల రెండు రైల్వే ట్రాక్‌లకు అంతరాయం కలిగింది.
పర్యవసానం 1: ట్రాక్‌పై పడిన బోగీలను తొలగించడానికి అవసరమైన పనిముట్లను, సంబంధిత సిబ్బందిని రైల్వే అథారిటీ వేగంగా పంపించాలి.
పర్యవసానం 2: ఆ రూట్లలో వచ్చే రైళ్లను వేరే దారిలో మళ్లించాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే
- View Answer
- సమాధానం:4
7. ప్రకటన: చాలా మంది టీవీల్లోనే సినిమాలు చూస్తున్నారు. కాబట్టి సినిమా థియేటర్ల యజమానులు చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు.
పర్యవసానం 1: సినిమా థియేటర్లను తొలగించి మల్టీషాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి.
పర్యవసానం 2: సినిమా థియేటర్లను అద్దెకివ్వాలి. తద్వారా ఆదాయం పొందొచ్చు.
1) పర్యవసానం 2 మాత్రమే సరైంది
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం 1 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 4
8. ప్రకటన: చిల్లర వర్తకుల దుకాణాలు ఫుట్‌పాత్‌లపై అధికంగా ఉన్నాయి.
పర్యవసానం 1: వారిని దూరం పంపడానికి పోలీసుల సహాయం అవసరం.
పర్యవసానం 2: చిల్లర వర్తకుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించి వారి వర్తకం సాగేట్లు చూడటం.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం 2 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 2
9. ప్రకటన: ఒక పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఇవ్వడం వల్ల చాలా మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫెయిలయ్యారు.
పర్యవసానం 1: ఆ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతించాలి.
పర్యవసానం 2: తప్పు జరగడానికి కారణాలు విశ్లేషించి కారకులను శిక్షించాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం 1 మాత్రమే సరైంది
4) పర్యవసానం 2 మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: 2
10. ప్రకటన: హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే సరస్సుల్లోని నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి.
పర్యవసానం 1: నీటి సరఫరా విభాగం కొంచెం కొంచెం నీటి సరఫరాను తగ్గించాలి.
పర్యవసానం 2: నీటి ఆదాపై ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పించాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
3) పర్యవసానాలు రెండూ సరైనవే
4) పర్యవసానం 2 మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: 3
11. ప్రకటన: చాలా మంది మెడికల్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ పాలనలో, బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
పర్యవసానం 1: వారిని అలాంటి ఉద్యోగాలకు వెళ్లకుండా నిరోధించాలి.
పర్యవసానం 2: ప్రభుత్వం ఒక కమిటీని నియమించి కారణాలు విశ్లేషించాలి. తగిన చర్యలు చేపట్టి, వారిని ఈ ఉద్యోగాల్లోకి వెళ్లకుండా చూడాలి.
1) పర్యవసానం 2 మాత్రమే సరైంది
2) పర్యవసానం 1 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 1
12. ప్రకటన: చాలా మంది డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయారు.
పర్యవసానం 1: అందరు విద్యార్థులను డిబార్ చేయాలి.
పర్యవసానం 2: వారిని పిలిపించి మళ్లీ అలా చేయొద్దని మందలించి వదిలి పెట్టాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవే
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానం 1 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 4