SI Posts for Both Womens: ఎస్ఐ పోస్టుకు ఎంపికైన ఇద్దరు అమ్మాయిలు
సివిల్ ఎస్సై ఫలితాల్లో మల్హర్ మండలంలోని అన్సాన్పల్లి గ్రామానికి చెందిన బానోత్ గీత, చిన్నతూడ్ల గ్రామానికి చెందిన నారా సుచిత్ర అనే ఇద్దరు అమ్మాయిలు ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికయ్యారు.
గమ్యానికి ప్రయాణం.. తల్లిదండ్రుల సహకారం
ఈ ఇద్దరు యువతులు వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆణిముత్యాలుగా నిలిచారు. ఒక అమ్మాయి పేరు బానోత్ గీత, తన తల్లిదండ్రులు సమ్మయ్య లలిత వారిది వ్యవసాయ కుటుంబం. మరో అమ్మాయి పేరు నారా సుచిత్ర, తన తల్లిదండ్రులు రామయ్య వీఆర్ఏ గా పని చేస్తుండగా ఆయన భార్య లక్ష్మి వ్యవసాయ పనులకు వెళ్తూ వారు వారి అమ్మాయిలను పై చదువులు చదివించారు. వారి కూతుర్లు గొప్ప స్థాయికి ఎదగాలని భావించి, వారి అమ్మాయిలను సివిల్స్ కోసం ప్రోత్సాహించారు. అలా, వారిద్దరు తమ కృషి పట్టుదలతో పాటు వారి కుటుంబ సహకారంతో సివిల్స్ ఎస్ఐ పరీక్షలు రాసి, ఫలితాల అనుసారంగా వారిద్దరూ ఎస్సై ఉద్యోగాని ఎంపికయ్యారు. ఈ విధంగా వారి విజయనాకి ప్రయాణం సాగింది.
తల్లిదండ్రుల ఆనందం..
ఇద్దరమ్మాయిలు ఎస్సైలుగా ఎంపిక కావడం తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేశారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతూ బిడ్డలను హత్తుకున్నారు లక్ష్యాన్ని నెరవేర్చారని అభినందించారు.