TS SI Exam Results: ఎస్సై పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే?.. ముల్యాంకనం ఇలా..
వివిధ విభాగాల్లోని ఎస్సై, తత్సమాన పోస్టులకు, కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులు కలిపి మొత్తం 15,644 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో మొత్తం 81 కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తుది రాత పరీక్షలకు 59,534 మంది హాజరయ్యా రు. ఇప్పటికే ప్రిలిమినరీ కీని విడుదల చేయడంతోపాటు అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 17 వరకు పోలీస్ నియామక మండలి సమయం ఇచ్చింది.
వచ్చిన అభ్యంతరాలు మరోసారి పరిశీలించి, వాటిలో అర్హమైన వాటిని పరిగణనలోకి తీసుకుని ముల్యాంకనం చేస్తున్నారు. మిగిలిన విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు సైతం తుది రాత పరీక్షలు ఏప్రిల్ 30తో పూర్తయ్యాయి. దీంతో తుది పరీక్ష ఫలితాల వెల్లడి పనులపైనే బోర్డు అధికారులు ఫోకస్ పెట్టారు. ముందుగా ఎస్సై రాత పరీక్ష ముగించిన అధికారులు ఫలితాలను జూన్ నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: Inspiring Story : శెభాష్.. ఇద్దరు ఇద్దరే.. ఒకేసారి మహిళా డీజీపీలుగా..