Skip to main content

TSLPRB: రెండు వారాల్లో ఈ ఉద్యోగాల ఎంపిక జాబితా

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఎస్సై ఉద్యోగాలు పొందే అభ్యర్థుల ఎంపిక జాబితా (సెలెక్షన్‌ లిస్ట్‌)ను అతి త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.
TSLPRB
రెండు వారాల్లో ఈ ఉద్యోగాల ఎంపిక జాబితా

నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకోవడంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలీస్‌ నియామక మండలి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సై, తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది రాత పరీక్షలో అర్హుల జాబితా విడుదల చేసినందున, తదుపరి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉండనుంది.

చదవండి: Inspiring Story : శెభాష్‌.. ఇద్దరు ఇద్ద‌రే.. ఒకేసారి మహిళా డీజీపీలుగా..

గత రిక్రూట్‌మెంట్‌లో 18 ప్రాంతాల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించగా, ఈసారి ఈ సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియను ముగించేందుకు పది రోజులు పట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఎస్సై తుది ఫలితాలు జూన్‌ రెండో వారం చివరి వరకు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఎస్సై పోస్టుల భర్తీ తర్వాతే, కానిస్టేబుల్‌ ఫలితాలు వెల్లడించేలా బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

చదవండి: Inspirational Success Story : కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణం.. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని నా బిడ్డ‌ను ఎస్సై చేశానిలా.. కానీ..

Published date : 31 May 2023 03:22PM

Photo Stories