Karunakar Reddy: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విమర్శలొద్దు
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామకంలో ఈడబ్ల్యుఎస్ వర్గాలకు తక్కువ మార్కులకు ఉద్యోగాల ఎంపికయ్యారని ఆరోపిస్తూ.. విమర్శించడం సరికాదన్నారు. గత 70 ఏళ్ల నుంచి 90 మార్కులు సాధించిన విద్య, ఉద్యోగ అవకాశాలు రాని నేపథ్యంలో ఏనాడు ఇతర వర్గాలను ఓసీలు నిందించలేదన్నారు. ఇతర వర్గాల రిజర్వేషన్లకు నష్టం కలగకుండా కేవలం అగ్రవర్ణాల్లోని పేదలకు ఉద్యోగ అవకాశాలు వస్తే ఇతర వర్గాలకు ఏమి నష్టమో స్పష్టం చేయాలని ఆయన పేర్కొన్నారు.
సామాజిక వివక్షత అంతరించి ఆర్థిక వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కూడా సమర్ధించిందని ఆయన తెలిపారు. మేజర్ జనరల్ సిన్హా నివేదిక ఆధారంగా పార్లమెంటులో చట్టం ద్వారా కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తే సమాజంలో సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.