Skip to main content

Police Constable: ‘కానిస్టేబుల్‌’ పరీక్షలకు కాల్‌లెటర్లు విడుద‌ల తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకోసం దేహదారుఢ్య, మెయిన్‌ పరీక్షలకు కాల్‌ లెటర్లను మార్చి 1 నుంచి 10వ తేదీలోగా తమ వెబ్‌సైట్‌ slprb.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి ఫిబ్ర‌వ‌రి 20న‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 Police Constable
‘కానిస్టేబుల్‌’ పరీక్షలకు కాల్‌లెటర్లు విడుద‌ల తేదీ ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకోసం ప్రిలిమినరీ పరీక్షను జనవరిలో నిర్వహించారు.
అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య, మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

చదవండి: AP పోలీస్ - స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | వీడియోస్

దేహదారుఢ్య పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీసు నియామక మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ మొదటివారంలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ పరీక్షల తేదీలను పోలీసు నియామక మండలి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

Published date : 21 Feb 2023 06:23PM

Photo Stories