Skip to main content

వాతావరణ మార్పు ప్రగతి సూచీ 2019లో భారత్ స్థానం?

పర్యావరణం :
పర్యావరణ ప్రగతి సూచీ 2018లో భారత్ చివరి నుంచి నాలుగో దేశంగా నిలిచింది. ప్రపంచంలో పర్యావరణ అంశాలపరంగా రూపొందించిన ఈ సూచీలో మొత్తం 180 దేశాలకుగాను భారత్ 177వ స్థానం పొందింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బంగ్లాదేశ్, బురిండి కంటే పర్యావరణ ప్రగతిలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థితి భారత్‌లో వాయు నాణ్యతను మెరుగుపరచుకోవడంతో పాటు, జీవవైవిధ్య పరిరక్షణ, గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాల తగ్గింపులాంటి అంశాల ఆవశ్యకతను తెలుపుతుంది. భారత్, చైనాలు ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పర్యావరణ ప్రగతి నివేదిక వెల్లడించింది. భారత్, చైనాల ఆర్థికాభివృద్ధి సాధనకు అవలంభిస్తున్న పద్ధతుల కారణంగా పర్యావరణ క్షీణత సంభవిస్తుంది. పర్యావరణ ఆరోగ్య విధానాల లక్ష్యంలో అల్ప ప్రగతి కారణంగా భారత్ ఈ సూచీలో మెరుగైన స్థితిని కనబర్చలేకపోయింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, ఫ్రాన్‌‌స, డెన్మార్‌‌క, మాల్టా, స్వీడన్‌లు మొదటి ఐదు స్థానాలు పొందాయి. వాతావరణం, శక్తి, వాయు కాలుష్యం కేటగిరీల్లో స్విట్జర్లాండ్ అధిక స్కోరు సాధించింది. నీరు, పారిశుద్ధ్యం కేటగిరీల్లో మాల్టా అధిక స్కోరు సాధించగా, పర్యావరణ ఆరోగ్యంలో భాగంగా వాయు నాణ్యత కేటగిరీ విషయంలో డెన్మార్‌‌క, మాల్టా, స్వీడన్‌లు అధిక స్కోరు సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాలతో పోలిస్తే ఈ సూచీలో అమెరికా వెనుకంజలో ఉంది.
  • వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘నేషనల్ క్లీన్ ఎయిర్’ కార్యక్రమంలో భాగంగా PAN India Air Pollution abatement' పథకాన్ని 102 నగరాల్లో ప్రారంభించింది. 2024 నాటికి వాయు కాలుష్యంలో 30 శాతం తగ్గుదలను సాధించాలని ప్రభుత్వం లక్ష్యం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు, జర్మన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, ఫ్రెంచ్ ఫండింగ్ ఏజెన్సీ, స్విస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, బ్లూంబర్‌‌గ Philonthropies లాంటి అంతర్జాతీయ ఏజెన్సీ నుంచి ఈ పథకానికి ఆర్థిక సహాయం లభిస్తుంది.
  • ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా, థాయ్‌లాండ్, బ్రిటన్‌లు అనేక చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఒకసారి వినియోగానికి పనికి వచ్చే ఆరు ప్లాస్టిక్ ఉత్పత్తులను భారత ప్రభుత్వం నిషేదిస్తుంది. 2022 నాటికి ఒకసారి వినియోగానికి పనికి వచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాలిథీన్ సంచులను నిషేధించాయి. ఆరు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం భారత్‌లో ప్రస్తుతం సంవత్సరానికి 14 మిలియన్ టన్నులు. దుకాణాలు, రెస్టారెంట్‌లు, కేఫ్‌లలో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తుల తగ్గింపు సంబంధించి వినియోగదారుల్లో అవగాహన కల్పించడానికి థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటానికి బ్రిటన్ ప్రభుత్వం, యూఎన్‌ఈపీ ఇప్పటికే చేపట్టిన ‘Tide Turners Plastic Challenge Badge’ను విస్తరించాలని భావిస్తున్నాయి. భారత్‌లో ఎయిర్ పోర్‌‌ట అథారిటీ ఆఫ్ ఇండియా 129 విమానాశ్రయాల్లో ఒకసారి వినియోగానికి పనికివచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించింది.
  • కాలుష్యం దేశస్థూల దేశీయోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాయు కాలుష్యం కారణంగా సంక్షేమంపై వ్యయం పెరిగినందుకు 2013లో భారత్ జి.డి.పి.లో 8.5 శాతం కోల్పోయినట్లు ప్రపంచ బ్యాంకు అధ్యయనం తెలుపుతుంది. వాయు కాలుష్యం కారణంగా 2015లో ముంబై, ఢిల్లీలలో రూ.70 వేల కోట్ల వ్యయం జరిగింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనం ప్రకారం అల్పాభివృద్ధి దేశాల్లో కాలుష్యం కారణంగా ఆర్థిక ఉత్పత్తిలో సాంవత్సరిక తగ్గుదల 2 శాతం. 2017లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ అభిప్రాయంలో కాలుష్య సంబంధిత మరణాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 2015లో కాలుష్య సంబంధిత మరణాల్లో 9 మిలియన్లు కాగా, ఈ మొత్తంలో భారత్ వాటా 2.5 మిలియన్లు. కాలుష్య సంబంధిత మరణాల పెరుగుదల అధికంగా ఇండియా, బంగ్లాదేశ్‌ల్లో నమోదైంది. మధ్య ఆదాయ దేశాల్లో కాలుష్యం కారణంగా సాంవత్సరిక ఆరోగ్య సంరక్షణ వ్యయంలో 7 శాతం పెరిగింది. కాలుష్యం కారణంగా అనేక వ్యాధులకు ప్రజలు గురవుతున్నప్పుడు ఆర్థిక వ్యయంలో పెరుగుదల ఏర్పడుతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా వర్షపాత ప్రక్రియలో మార్పులు సంభవిస్తాయి. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొనే చర్యల కారణంగా ఉత్పాదకత పెరిగి ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి.
మాదిరి ప్రశ్నలు:
Published date : 23 Sep 2019 04:43PM

Photo Stories