Skip to main content

ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ ఉద్దేశం ఏది?

సాంఘిక రంగం:
ఆరోగ్యం:
స్వాతంత్య్రానంతరం ఆరోగ్య సూచికల విషయంలో భారత్ ప్రగతి సాధించింది. ఆయుఃప్రమాణం పెరుగుదలతోపాటు శిశు మరణాల రేటు, క్రూడ్ మరణ రేటుల్లో తగ్గుదల ఏర్పడింది. ఆరోగ్యవంతమైన జనాభా కలిగిన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2018 ప్రకారం భారతదేశంలో ఆయుః ప్రమాణం 1970-75 మధ్య కాలంలో 49.7 సంవత్సరాలు కాగా 2011-15 మధ్య కాలంలో 68.3 సంవత్సరాలకు పెరిగింది. ఆయుఃప్రమాణం స్త్రీలల్లో 70 సంవత్సరాలు కాగా పురుషుల్లో 66.9 సంవత్సరాలుగా నమోదైంది. శిశు మరణాల రేటు 2016లో ప్రతి వెయ్యి జననాలకు 34గా నమోదైంది. శిశు మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి జననాలకు 38 కాగా, పట్టణ ప్రాంతాల్లో 23. సంతాన సాఫల్యతా రేటు 2.3 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 2.5, పట్టణ ప్రాంతాల్లో 1.8. ప్రసూతి మరణాల రేటు అసోంలో అధికంకాగా కేరళలో తక్కువ. 2011-13 మధ్య కాలంలో ప్రసూతి మరణాలు ప్రతి లక్ష జననాలకు అసోంలో 300 కాగా కేరళలో 61గా నమోదయ్యాయి.
ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం 2009-10లో రూ. 621 నుంచి 2017-18 (BE)లో రూ. 1657కు పెరిగింది. ఇదే కాలంలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం జి.డి.పి.లో 1.12 శాతం నుంచి 1.28 శాతానికి పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2015లో అధిక ఆదాయ దేశాలు ఆరోగ్య రంగంపై చేసిన వ్యయం ఆయా దేశాల జి.డి.పి.లో 5.2 శాతం కాగా, ఎగువ మధ్య ఆదాయ దేశాలు 3.8 శాతం, దిగువ మధ్య ఆదాయ దేశాలు 2.5 శాతం, అల్పాదాయ దేశాలు 1.4 శాతం వ్యయం చేయగా భారత్ వ్యయం జి.డి.పి.లో 1 శాతం మాత్రమే భారత్ ఇరుగు పొరుగు దేశాలైన మాల్దీవులు ఆరోగ్య రంగంపై చేసిన వ్యయం 2015లో జి.డి.పి.లో 9.4 శాతం కాగా, థాయ్‌లాండ్ 2.9 శాతం, భూటాన్ 2.5 శాతం, శ్రీలంక 1.6 శాతం, ఇండోనేషియా 1.1 శాతం, మలేషియాలు 1.1శాతం వ్యయం చేశాయి. 2018 సెప్టెంబర్‌న రాంచీలో ప్రధాని ఆయుష్మాన్ భారత్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

విద్య:
భారత్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల అందుబాటులోని తేడా విద్య నాణ్యతపై ప్రభావాన్ని చూపుతోంది. పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఉన్నత విద్య అందుబాటుకు ప్రాధాన్యమిచ్చింది. విద్యా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2002 నుంచి ప్రభుత్వం అనుమతిస్తోంది. విద్యా రంగంలో ఎఫ్.డి.ఐ. లు 2000 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబర్ మధ్య కాలంలో 1639 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019 మార్చి నాటికి 60 మిలియన్ గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ లిటరసీ అందించడానికి ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్‌ను ప్రారంభించడం జరిగింది. ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు ఆధారంగా ప్రపంచంలో భారత్ రెండో స్థానం పొందింది. 2011-12లో ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు నిష్పత్తి 29.18 శాతంకాగా 2016-17లో 35.70 శాతానికి పెరిగింది. ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు నిష్పత్తి లక్ష్యం 2020 నాటికి 30 శాతం సాధించాలంటే ప్రభుత్వం 200 బిలియన్ డాలర్ల పెట్టుబడిని చేయాల్సి ఉంటుంది. 2016-17 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 25.2 శాతంగా న మోదైంది.
భారత్ మొత్తం జనాభాలో 5 నుంచి 24 సంవత్సరాల మధ్య జనాభా 500 మిలియన్లుగా ఉండటం విద్యా రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. 2016 ఫిబ్రవరిలో విద్యా రంగ మార్కెట్ విలువ 97.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్‌లో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. విద్యా రంగంలో సరళీకరణ విధానాల్లో భాగంగా విదేశీ విద్యా సంస్థల బిల్లు-2010, ‘ది ఎడ్యుకేషనల్ ట్రైబ్యునల్స్ బిల్లు-2010’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యత ఉన్న విద్యను అందించడానికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6000 పాఠశాలలను 20 నూతన డిజైన్ ఇన్నోవేషన్ కేంద్రాలు, ఒక ఓపెన్ డిజైన్ పాఠశాలతో అనుసంధాన పరచడానికి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డిజైన్ ఇన్నోవేషన్’ను ప్రారంభించింది. 2017 ఆగస్టులో నీతి ఆయోగ్ ‘మెంటర్ ఇండియా’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. స్కిల్ ఇండియా మిషన్ అభివృద్ధి నిమిత్తం ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ‘సంకల్ప్’, STRIVE పథకాలకు 2017 అక్టోబర్‌న ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో విద్యా రంగ అభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సంప్రదాయ విద్యా సంస్థల అభివృద్ధిని పి.పి.పి.లో భాగంగా అభివృద్ధిపరచడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. పన్నెండో ప్రణాళికలో పి.పి.పి.లో భాగంగా విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం 48.8 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించింది. 2016లో పి.పి.పి. కింద 2500 మోడల్ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నత విద్యపై వ్యయం వృద్ధి రాబోవు పది సంవత్సరాల కాలంలో 18 శాతంగా ఉండగలదని అంచనా. 1986 జాతీయ విద్యా విధానాన్ని సవరించడం ద్వారా 1992లో ‘నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్’ను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్ పథకంగా 1995లో ‘న్యూట్రిషనల్ సపోర్‌‌ట టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ఉన్నత విద్యను పెంపొందించడానికి 1995లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్’ అనే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2012లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ (1961)ను సవరించి ఎనిమిది ఐ.ఐ.టి.లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సెకండరీ విద్య అందుబాటు కోసం 2009 మార్చిలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ఇతర నిర్లక్ష్యపరచబడిన వర్గాల వారిలో అక్షరాస్యత పెంపొందించడానికి ‘సాక్షర్‌భారత్’ను కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్‌‌డ పథకంగా ప్రభుత్వం ప్రకటించింది. 2016 మేలో దేశంలో మొత్తం విద్యార్థుల కదలికలను ట్రాక్ చేయడానికి ‘శాల అస్మితా యోజన’ పథకం ప్రారంభమైంది. 2020-40 మధ్య కాలంలో నాణ్యతతో కూడిన విద్యను అందించడానికి నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌ను రూపొందించారు.

మాదిరి ప్రశ్నలు:

Published date : 27 Nov 2018 04:26PM

Photo Stories