ప్రధాన శ్రామికుడు అంటే?
- ఒక దేశంలో వృత్తి నిర్మాణత ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృత్తి నిర్మాణతను నిర్ణయించే అనేక అంశాలలో సహజ వనరుల లభ్యత, తలసరి ఆదాయ స్థాయి, ఉత్పాదకతలో వృద్ధి, ప్రత్యేకీకరణపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయంగా వృత్తులను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా వర్గీకరించవచ్చు. వ్యవసాయం, అడవులు, కలప, పశు సంపద, ఫిషింగ్, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు కాగా మైనింగ్ & క్వారియింగ్, నిర్మాణ రంగం, తయారీ రంగం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా పారిశ్రామిక రంగ కార్యకలాపాలు రవాణా, నిల్వ, సమాచారం, వాణిజ్యం, వర్తకం, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, కమ్యూనిటీ సేవలు, ఐ.టి. & అనుబంధ సర్వీస్లు, వ్యక్తిగత సేవలు, పర్యాటకం, గిడ్డంగులు సేవా రంగానికి సంబంధించిన ఉప రంగాలు.
- అనేక అల్పాభివృద్ధి దేశాలు ప్రస్తుతం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలుగానే మిగిలిపోయాయి. వ్యవసాయ రంగంలో శ్రమ సాంద్రత సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా వినియోగిస్తున్నందు వల్ల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ఆయా దేశాలలో వ్యవసాయ రంగంలో మూలధన - శ్రామిక నిష్పత్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ వినియోగంలో ఉన్న అధిక మూలధన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉత్పాదకతలో పెరుగుదల లేకపోవడానికి వ్యవసాయ కార్యకలాపాల లక్షణం కారణమవుతుంది. తృతీయ ప్రపంచ దేశాలలో పారిశ్రామిక రంగం చిన్నదిగా ఉండి తక్కువ శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. ఆయా దేశాలలో పారిశ్రామిక రంగంలోనే పెద్ద తరహా తయారీ పరిశ్రమలలో ఆధారపడిన శ్రామిక శక్తి తక్కువ. పారిశ్రామిక రంగంలో అల్ప మూలధన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిన్నతరహా, కుటీర పరిశ్రమలు అధిక ఉపాధి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో 1989-90లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తిలో చిన్నతరహా, కుటీర పరిశ్రమల వాటా 82.2 శాతం కాగా పెద్ద, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్ల వాటా 17.8 శాతం. పారిశ్రామిక రంగంతో పోల్చిన ప్పుడు సేవా రంగంలో ఉత్పాదకత ఎక్కువ. వ్యవసాయ రంగంపై ఆధారపడిన మిగులు శ్రామిక శక్తిని పారిశ్రామిక, సేవా రంగాలకు తరలించడాన్ని ఆర్థిక ప్రగతికి సూచికగా భావించవచ్చు.
- ఒక దేశ తలసరి ఆదాయ స్థాయి శ్రామిక శక్తి వృత్తుల వారీ పంపిణీపై ఆధారపడి ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాలలో జాతీయాదాయంలో అధిక భాగం వ్యవసాయ రంగంలో ఉత్పత్తిచేయబడిన వస్తువులపై అధికంగా ఉంటుంది. అధిక శ్రామిక శక్తి ఆయా దేశాలలో వ్యవసాయం, పశుసంపద, అడవులు, ఫిషరీస్పై ఆధారపడి ఉంటుంది. వృద్ధి, పెరుగుదలతో పాటు తలసరి ఆదాయ స్థాయి పెరిగినప్పుడు తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తయారీ రంగ ఉత్పత్తి విస్తరిస్తుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో అధిక ఉపాధి కల్పన సాధ్యమవుతుంది. పారిశ్రామికీకరణ తొలి దశలో పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామిక శక్తిలో పెద్దగా మార్పులేనప్పటికీ తలసరి ఆదాయంలో పెరుగుదల కారణంగా ఆయా ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి పెద్ద స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటయినప్పుడు ఆ రంగంపై ఆధారపడే శ్రామిక శక్తి పెరుగుతుంది.
- భారత్ వృత్తి నిర్మాణతలో మార్పు లేకపోవడానికి కారణాలు
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న మిగులు శ్రామిక శక్తిని వినియోగించుకోవడంలో ప్రణాళికా రచయితలు విఫలమయ్యారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళికాయుగంలో ప్రకటించిన అనేక పథకాలు అల్ప ఉద్యోగిత, నిరుద్యోగాన్ని తగ్గించడంలో విఫలమయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయేతర ఉపాధిని పెంపొందించడంలో విధాన నిర్ణేతలు విఫలమయ్యారు.
- భూ సంస్కరణలు లక్ష్యాల సాధనలో వైఫల్యం కావడం భారత వృత్తి నిర్మాణతలో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణమయింది. శ్రామిక శక్తి వృద్ధిరేటు కూడా అధికంగా ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లభ్యం కానందువల్ల పెరుగుతున్న శ్రామిక శక్తి వ ్యవసాయ రంగాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరిగింది.
- భారీ పారిశ్రామికీకరణ నేపథ్యంలో పెద్ద తరహా మూలధన వస్తు రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చినందు వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెద్ద తరహా పరిశ్రమలు అధిక మూలధన సాంద్రతను కలిగి ఉండి తక్కువ పెట్టుబడితో ఏర్పాటుచేయగలిగే ఎం.ఎస్.ఎం.ఇ. రంగంపై ప్రభుత్వం దృష్టిసారించనందు వల్ల పెరుగుతున్న శ్రామిక శక్తి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగాన్నే ఆశ్రయిస్తున్నారు.
- సంస్థాపరమైన పరపతి, మార్కెటింగ్, ఎరువు ధరలపై సబ్సిడీకి సంబంధించి ధనిక రైతులే అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఉపాంత, చిన్న తరహా రైతులు ఈ ప్రయోజనాలను పొందలేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. తద్వారా వారి ఆదాయాలు తగ్గి పారిశ్రామిక రంగంలో తయారయ్యే ఉత్పత్తులను డిమాండ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక రంగంలో ఆశించిన వృద్ధి జరగనందు వల్ల వ్యవసాయ రంగంపై ఆధారపడిన మిగులు శ్రామికులకు పారిశ్రామిక రంగం ఉపాధి కల్పించలేకపోతుంది.
మాదిరి ప్రశ్నలు
1. బ్రిటిష్ కాలంలో ప్రాథమిక రంగంలో ఆధారపడిన శ్రామికుల నిష్పత్తిలో పెరుగుదలకు కారణం?
1) వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అధికంగా ఉండటం
2) కుటీర, చిన్నతరహా పరిశ్రమలు క్షీణించడం
3) రైల్వేలు, సమాచార రంగంలో అభివృద్ధి రేటు ఎక్కువగా ఉండటం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
2. స్వాతంత్య్రానంతరం ప్రాథమిక రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తిలో పెద్దగా మార్పు లేకపోవడానికి కారణం?
1) గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికుల గమనశీలత తక్కువ
2) నైపుణ్యత తక్కువగా ఉండటం వల్ల ఇతర రంగాలకు వెళ్లలేకపోవడం
3) భూమి పుత్రుల సిద్ధాంతంపై రైతులకు విశ్వాసం అధికంగా ఉండటం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. ప్రధాన శ్రామికుడు అంటే?
1) ఒక సంవత్సరంలో 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పనిచేసే వ్యక్తి
2) ఒక సంవత్సరంలో 6 నెలలు కంటే తక్కువ కాలం పనిచేసే వ్యక్తి
3) ఒక సంవత్సర కాలంలో 285 పని దినాలు కలిగిన వ్యక్తి
4) ఒక సంవత్సర కాలంలో 310 పని దినాలు కలిగిన వ్యక్తి
- View Answer
- సమాధానం: 1
4. 2011 సెన్సెస్ ప్రకారం దేశ వ్యాప్తంగా మొత్తం పనివారు ఎంత మంది ఉన్నారు?
1) 450.5 మిలియన్లు
2) 460.5 మిలియన్లు
3) 481.7 మిలియన్లు
4) 499.9 మిలియన్లు
- View Answer
- సమాధానం: 3
5. ఒక ఆర్థిక వ్యవస్థలో వృత్తి నిర్మాణతను నిర్ణయించే అంశం ఏది?
ఎ) భౌగోళిక అంశాలు
బి) ఉత్పాదకత శక్తుల అభివృద్ధి
సి) శ్రమ విభజన, ప్రత్యేకీకరణ
డి) తలసరి ఆదాయ స్థాయి
1) ఎ, బి
2) సి మాత్రమే
3) డి మాత్రమే
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
6. 2011 గణాంకాల ప్రకారం మొత్తం జనాభాలో 15 సంవత్సరాలు, అంతకుపైనా వయోవర్గం జనాభా శాతం ఎంత?
1) 68.2
2) 70.2
3) 71.4
4) 75.2
- View Answer
- సమాధానం: 2
7. సాధారణ స్థితి నిరుద్యోగం, వారంవారీ, రోజువారీ స్థితి నిరుద్యోగిత అనే కొలమానాలను అభివృద్ధి పరిచింది ఏది?
1) కేంద్ర గణాంక సంస్థ
2) ప్రణాళిక సంఘం
3) నేషనల్ శాంపుల్ సర్వే
4) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
- View Answer
- సమాధానం: 3
8. 2011లో భారత్లో పనిలో పాల్గొనే శ్రమశక్తి ఎంత శాతం?
1) 27.8
2) 29.3
3) 37.8
4) 39.8
- View Answer
- సమాధానం: 4
9. జనాభా వృద్ధిలో ఏ సంవత్సరం నాటికి స్థిరత్వం సాధించాలని జాతీయ జనాభా విధానం (2000) లక్ష్యంగా తీసుకొంది?
1) 2019
2) 2025
3) 2035
4) 2046
- View Answer
- సమాధానం: 4
10. అధిక జనాభా వృద్ధి ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉండటంతో పాటు వనరులపై ఒత్తిడి పెరిగి తలసరి ఆదాయం తగ్గుతుందని అభిప్రాయపడింది?
1) మాల్థస్
2) రాబిన్సన్
3) జె.బి. సే
4) మార్షల్
- View Answer
- సమాధానం: 1
11.ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువస్థాయి ఉత్పాదక పనుల్లో పని చేయడాన్ని ఎలా భావిస్తారు?
1) నిరుద్యోగం
2) అల్ప ఉద్యోగిత
3) పూర్ణోద్యోగిత
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
12. ఆరు నెలల కంటే తక్కువ కాలం పనిచేసే శ్రామికుడిని ఏ విధంగా పిలుస్తారు?
1) ఉపాంత శ్రామికుడు
2) ప్రధాన శ్రామికుడు
3) వ్యవసాయ కూలీలు
4) వ్యవసాయదారుడు
- View Answer
- సమాధానం: 1
13. స్వాతంత్య్రానంతరం ద్వితీయ రంగంపై ఆధారపడే శ్రామిక శక్తిలో కొద్దిపాటి పెరుగుదల మాత్రమే రావడానికి కారణం ఏమిటి?
1) శ్రమ సాంద్రత పరిశ్రమలైన చిన్న తరహా, కుటీర పరిశ్రమలు క్షీణించడం
2) మూలధన సాంద్రతతో కూడిన భారీ పరిశ్రమల పెరుగుదల
3) సంస్కరణ కాలంలో ప్రభుత్వ విధానాల్లో మార్పులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. ప్రణాళికా సంఘం 1969లో కింది ఎవరి అధ్యక్షతన ఉద్యోగిత అంచనాపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది?
1) అలఘ్
2) దంత్వాలా
3) రంగరాజన్
4) అబిద్ హుస్సేన్
- View Answer
- సమాధానం: 2
15. కింది వాటిలో కోలిన్ క్లార్క్ అభిప్రాయానికి సంబంధించి సరైంది?
1) ప్రాథమిక రంగంపై ఆధారపడిన వారికి, వారు పొందే తలసరి ఆదాయానికి అనులోమ సంబంధం ఉంటుంది
2) ప్రాథమిక రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తికి, వారు పొందే తలసరి ఆదాయానికి విలోమ సంబంధం ఉంటుంది
3) సేవా రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తికి, వారు పొందే తలసరి ఆదాయానికి విలోమ సంబంధం ఉంటుంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
16. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఉద్యోగిత, పెట్టుబడి ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ, తృతీయ రంగాలకు తరలిపోతుందని పేర్కొన్నవారు ఎవరు?
1) భగవతి
2) సురేశ్ టెండూల్కర్
3) ప్రణాళిక సంఘం
4) ఫిషర్
- View Answer
- సమాధానం: 4
17. నిరుద్యోగ సమస్యపై 1973లో ఏర్పాటు చేసిన నిపుణల కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?
1) ఎస్.పి. గుప్తా
2) భగవతి
3) మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
4) వై.వి. రెడ్డి
- View Answer
- సమాధానం: 2
18. సర్వే చేసే కాలానికి ముందు ఒక వారంలో ఏ ఒక్క గంట కూడా పని పొందని స్థితి?
1) వారం వారీ స్థితి నిరుద్యోగిత
2) రోజువారీ స్థితి నిరుద్యోగిత
3) సాధారణ స్థితి నిరుద్యోగిత
4) అల్ప ఉద్యోగిత
- View Answer
- సమాధానం: 1
19. నిరుద్యోగ రేటును ఎలా నిర్వచించవచ్చు?
1)
2)
3)
4)
- View Answer
- సమాధానం: 3
20. వ్యవస్థాపరమైన నిరుద్యోగాన్ని ఎలా పిలుస్తారు?
1) మార్కసియన్ నిరుద్యోగిత
2) బహిరంగ నిరుద్యోగిత
3) దీర్ఘకాలిక నిరుద్యోగిత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించే నిరుద్యోగం?
1) ప్రచ్ఛన్న నిరుద్యోగం
2) ఘర్షిత లేదా సంఘృష్టి నిరుద్యోగం
3) అల్ప ఉద్యోగిత
4) రుతు సంబంధ నిరుద్యోగం
- View Answer
- సమాధానం: 2
22. సర్వే చేసే తేదికి ముందు ఒక సంవత్సర కాలంలో నిరుద్యోగులుగా ఉన్న స్థితిని ఎలా భావిస్తారు?
1) రోజువారీ స్థితి నిరుద్యోగిత
2) వారం వారీ స్థితి నిరుద్యోగిత
3) సాధారణ స్థితి నిరుద్యోగిత
4) ఘర్షిత నిరుద్యోగిత
- View Answer
- సమాధానం: 3
23. Conditions of Economic Progress and Occupational Distribution అనే గ్రంథాన్ని రాసినవారు ఎవరు?
1) కోలిన్ క్లార్క్
2) గౌరవ్ దత్
3) జె.బి. సే
4) సెమన్ కుజ్ నట్స్
- View Answer
- సమాధానం: 1
24.ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన శ్రామికులు పారిశ్రామిక, సేవా రంగాలకు తరలి పోతారని పేర్కొన్నవారు?
1) గౌరవ్ దత్
2) కోలిన్ క్లార్క్
3) జె.బి. సే
4) సైమన్ కుజ్ నట్స్
- View Answer
- సమాధానం: 4
25.భారత్లో ప్రచ్ఛన్న, రుతు సంబంధ నిరుద్యోగం కింది ఏరంగంలో కనిపిస్తుంది?
1) భారీ పరిశ్రమలు
2) వ్యవసాయ రంగం
3) వాణిజ్యం, వర్తకం
4) నిర్మాణ రంగం
- View Answer
- సమాధానం: 2
26. వ్యాపార చక్రాలు సంభవించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలలో ఒడిదుడుకులు ఏర్పడి ఉపాధి లభించని స్థితి?
1) ఘర్షిత నిరుద్యోగిత
2) అల్ప ఉద్యోగిత
3) చక్రీయ నిరుద్యోగిత
4) సాంకేతిక పరమైన నిరుద్యోగిత
- View Answer
- సమాధానం: 3
27. మిలియన్ బావుల పథకాన్ని కింది ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1988
2) 2001
3) 2007
4) 2017
- View Answer
- సమాధానం: 1
28. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 2006
2) 2008
3) 2014
4) 2018
- View Answer
- సమాధానం: 2