భారత రూపాయి సింబల్‌ను డిజైన్ చేసిందిఎవరు?
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంచనా ప్రకారం 2018-19 మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ స్థిర ధరల వద్ద రూ.34.14 లక్షల కోట్లు కాగా, 2019-20 మొదటి త్రైమాసికంలో రూ.35.85 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి 5 శాతంగా నమోదైంది. 8 కీలక పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి ఆగస్టు 2018లో 4.5 శాతం కాగా, ఆగస్టు 2019లో రుణాత్మక వృద్ధి (-0.5 శాతం) నమోదైంది. ముడి చమురు, బొగ్గు, సహజ వాయువు, సిమెంటు, విద్యుచ్ఛక్తి రంగాల ఉత్పత్తిలో రుణాత్మక వృద్ధి నమోదైనందుకు 2019 ఆగస్టులో కీలక పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి మందగించింది. ఈ స్థితి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి క్షీణతను స్పష్టం చేస్తుంది.
- ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత వృద్ధిని 2019-20లో 6.5 శాతంగా అంచనా వేసింది. స్వదేశీ డిమాండ్, పెట్టుబడుల్లో రికవరీతో పాటు ప్రభుత్వ విధానాల కారణంగా 2020-21లో 7.2 శాతం వృద్ధిని భారత్ సాధిస్తుందని ‘ఆిసియాన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ 2019’లో ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. కార్పొరేషన్ పన్ను రేటు తగ్గింపు కారణంగా ప్రైవేటు పెట్టుబడులు పెరిగి పోటీతత్వం మెరుగవుతుంది. బ్యాంక్ రీకాపిటలైజేషన్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు అవసరమైన మద్దతు, రిజర్వబ్యాంకు ద్రవ్య విధాన రేట్ల తగ్గింపులాంటి చర్యల కారణంగా పారిశ్రామిక రంగం, అవస్థాపనా రంగంలో పరపతి ప్రవాహం పెరుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది.
- ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయంలో 2019వ సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడానికి కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు కారణమైంది. ఈ కాలంలో కేంద్ర బ్యాంకులు 224.4 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. డాలర్ విలువలో ఒడిదుడుకుల కారణంగా ముందు జాగ్రత్త కోసం కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో భారత రిజర్వు బ్యాంకు 42 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం రిజర్వుబ్యాంకు వద్ద బంగారం నిల్వ 618 టన్నులకు చేరుకుంది. బంగారం ధరలకు, వడ్డీరేట్లకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లలో పెరుగుదల ఏర్పడినపుడు పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా స్థిర ప్రతిఫలాన్నిచ్చే ఇతర స్థిర ఆదాయ పెట్టుబడులకు ఆకర్షితులవుతారు. తద్వారా బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి.
- 2019 జూన్ చివరి నాటికి భారత విదేశీ రుణం 557.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2019 మార్చి తర్వాత భారత విదేశీ రుణంలో పెరుగుదల 14.1 బిలియన్ డాలర్లు. భారత విదేశీ రుణంలో వాణిజ్య రుణాల వాటా ఎక్కువ. భారత కేంద్ర బ్యాంకు గణాంకాల ప్రకారం మొత్తం విదేశీ రుణాంలో వాణిజ్య రుణాల వాటా 38.4 శాతం కాగా, నాన్ రెసిడెంట్ డిపాజిట్ల వాటా 24 శాతం, స్వల్పకాల వాణిజ్య పరపతి వాటా 18.7 శాతం. 2019 జూన్ నాటికి మొత్తం విదేశీ రుణంలో దీర్ఘకాల రుణం 447.7 బిలియన్ డాలర్లు. భారత విదేశీ రుణంలో అమెరికా డాలర్ రూపేణ రుణం అధికం. 2019 జూన్ చివరి నాటికి భారత విదేశీ రుణంలో డాలర్ రూపేణా రుణం వాటా 51.5 శాతం కాగా, రూపాయి వాటా 34.7 శాతం, యెన్ 5.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 4.7 శాతం, యూరో 3.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల విదేశీ రుణంలో పెరుగుదల ఏర్పడింది.
- నైపుణ్యతాభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, renewable energy, ఐ.టి. సర్వీసులు, అంతరిక్ష పరిశోధన లాంటి అంశాలకు సంబంధించి 2019 ఆగస్టులో భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందంపై సంతకం జరిగింది.
- రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం లాంటి ముఖ్యాంశాలకు సంబంధించి 2019 జూన్‌లో భారత్, కజకిస్తాన్ మధ్య 15 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
- దక్షిణాఫ్రికాలోని మలావీలో భారత్- ఆఫ్రికా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు సంబంధించి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసు, భారత్‌ల మధ్య 2019 ఏప్రిల్‌లో ఒప్పందంపై సంతకం జరిగింది.
- 2018 డిసెంబర్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి పెంపునకు సంబంధించి భారత్, యూఏఈ మధ్య ‘కరెన్సీ స్వాప్’ ఒప్పందం జరిగింది.
- భారతీయ కరెన్సీలో యునెటైడ్ కమర్షియల్ బ్యాంకు ద్వారా చ మురు వాణిజ్యానికి సంబంధించి ఇండియా, ఇరాన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
- భారత్, చైనాల మధ్య 2017లో ద్వైపాక్షిక వాణిజ్యం 84.44 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
- భారత ఎగుమతి-దిగుమతి బ్యాంకు, కొరియా ఎగుమతి-దిగుమతి బ్యాంకుల మధ్య ప్రతిపాదిత ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- భారత్, ఘనాల మధ్య రాబోయే మూడు సంవత్సరాల కాలంలో వాణిజ్యం 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
1. Child wellbeing index 2019లో అతి తక్కువ ప్రగతి కనపర్చిన రాష్ర్టం ఏది?
1) కేరళ
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
2. 2019 జూన్ నాటికి భారత విదేశీ రుణం ఎంతగా ఉంది?
1) 557.4 బిలియన్ డాలర్లు
2) 597.4 బిలియన్ డాలర్లు
3) 598.4 బిలియన్ డాలర్లు
4) 599.4 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
3. దక్షిణాఫ్రికాలోని మలావీలో ఇండియా - ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు సంబంధించి భారత్ కింది ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) నాబార్డ్
2) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్
3) యు.ఎన్.ఇ.పి.
4) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్
- View Answer
- సమాధానం: 4
4. భారత్, ఘనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రాబోయే 3 సంవత్సరాల్లో ఎంతకు పెరుగుతుందని అంచనా?
1) 3 బిలియన్ డాలర్లు
2) 4 బిలియన్ డాలర్లు
3) 5 బిలియన్ డాలర్లు
4) 7 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
5. నీతి ఆయోగ్ రూపొందించిన composite water management index లో ప్రథమ స్థానం పొందిన రాష్ర్టం ఏది?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
6. Asia power index 2019ని రూపొందించింది ఏది?
1) కేంబ్రిడ్‌జ విశ్వవిద్యాలయం
2) Lowy ఇన్స్టిట్యూట్
3) హార్వర్డ విశ్వవిద్యాలయం
4) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
7. ప్రపంచ అసమానత సూచీ 2019లో ప్రథమ స్థానం పొందిన దేశం ఏది?
1) డెన్మార్క్
2) కెన్యా
3) ఘనా
4) ఇథియోపియా
- View Answer
- సమాధానం: 1
8. ది ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ కింది ఏ సూచీలను 2019లో రూపొందించింది?
ఎ. Global livability index
బి. ఆసియా పవర్ ఇండెక్స్
సి. సేఫ్ సిటీస్ సూచీ
డి. గ్లోబల్ కిడ్స రైట్ సూచీ
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
9. ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ 2019లో ప్రథమ స్థానం పొందిన దేశం ఏది?
1) సింగపూర్
2) డెన్మార్క
3) జపాన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
10. గ్లోబల్ పీస్ ఇండెక్స్ (ప్రపంచ శాంతి సూచీ) 2019లో ప్రథమ స్థానం పొందిన దేశం ఏది?
1) ఇండియా
2) జర్మనీ
3) రష్యా
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 4
11. చిల్డ్రన్స్ వెల్ బీయింగ్ ఇండెక్స్ 2019ను రూపొందించింది?
1) ఐఎఫ్ఎంఆర్ లీడ్
2) యూఎన్డీపీ
3) యూఎన్ఈపీ
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
- View Answer
- సమాధానం: 1
12. జూన్ 2019 నాటికి భారత్ విదేశీ రుణంలో అధిక వాటా ఉన్నదేది ?
1) ఎన్ఆర్ఐ డిపాజిట్లు
2) స్వల్పకాల రుణం
3) బహిర్గత వాణిజ్య రుణాలు
4) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్
- View Answer
- సమాధానం: 3
13. పాఠశాల విద్య నాణ్యతా సూచీని రూపొందించింది?
1) నీతి ఆయోగ్
2) ఆర్థిక సంఘం
3) మానవ వనరుల అభివృద్థి మంత్రిత్వ శాఖ
4) యూఎన్ఈపీ
- View Answer
- సమాధానం: 1
14. ఐఎండీ ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ 2019లో భారత్ స్థానం?
1) 23
2) 35
3) 41
4) 44
- View Answer
- సమాధానం: 4
15. ఇటీవల ఐఎంఎఫ్ చీఫ్‌గా ఎంపికైన క్రిస్టాలినా జార్జీవా ఏ దేశానికి చెందిన వారు?
1) అల్జీరియా
2) బల్గేరియా
3) ఫ్రాన్స్
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
16. 2019 సెప్టెంబర్ 25న ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ వృద్ధిని 2019-20లో ఎంతగా అంచనా వేసింది?
1) 6.5 శాతం
2) 6.8 శాతం
3) 7.1 శాతం
4) 7.2 శాతం
- View Answer
- సమాధానం: 1
17. ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి కిరాయిదార్ బిజ్లీ మీటర్ యోజన’ లక్ష్యం?
1) వ్యవసాయానికి ఉచిత విద్యుత్
2) ఢిల్లీలో అద్దె గ ృహాల్లో ఉండే వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
3) వాణిజ్య అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
18. ఇటీవల గాంధీ సోలార్ పార్కును ఎక్కడ ప్రారంభించారు?
1) ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం
2) ప్రపంచ వాణిజ్య సంస్థ
3) ప్రపంచ బ్యాంకు కేంద్ర కార్యాలయం
4) పైవే వీ కావు
- View Answer
- సమాధానం: 1
19. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ కింది ఏ సూచీని 2019లో రూపొందించింది?
1) ఆసియా శాంతి సూచీ
2) ఆఫ్రికా శాంతి సూచీ
3) ప్రపంచ శాంతి సూచీ
4) లాటిన్ అమెరికా శాంతి సూచీ
- View Answer
- సమాధానం: 3
20. భారత్‌లో 8 కీలక పరిశ్రమల ఉత్పత్తికి సంబంధించి నెలవారీ గణాంకాలను ప్రచురించేది?
1) వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ
2) జాతీయాదాయ కమిటీ
3) నేషనల్ శాంపిల్ సర్వే
4) ఐ.సి.ఎ.ఇ.ఆర్
- View Answer
- సమాధానం: 1
21. భారత రూపాయి సింబల్‌ను డిజైన్ చేసింది ఎవరు?
1) రాజీవ్ కుమార్
2) ఉదయ్‌కుమార్
3) రాకేష్ కుమార్
4) రఘురాం రాజన్
- View Answer
- సమాధానం: 2
22. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సపై కింది ఏ పన్నును భారత్‌లో ప్రవేశపెట్టారు?
1) సేవల పన్ను
2) సంపద పన్ను
3) ఆదాయపు పన్ను
4) బహుమతి పన్ను
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో ముడిచమురు ఉత్పత్తికి సంబంధించింది ఏది?
1) శ్వేత విప్లవం
2) నీలి విప్లవం
3) నల్ల విప్లవం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
24. సన్‌రైజింగ్ ఇండస్ట్రీగా కింది వాటిలో దేనిగా భావించవచ్చు?
1) సిమెంట్ పరిశ్రమ
2) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
3) విద్యా రంగం
4) ఆరోగ్య రంగం
- View Answer
- సమాధానం: 2
25. అంతర్జాతీయ కాఫీ ఆర్గనైజేషన్‌ను 1963లో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కరాచీ
2) జకార్తా
3) టోక్యో
4) లండన్
- View Answer
- సమాధానం: 4
26. హౌసింగ్ ఫైనాన్స్ సెక్యూరిటైజేషన్ మార్కెట్ అభివృద్ధికి సంబంధించి రిజర్వ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు?
1) హర్షవర్థన్
2) శక్తికాంత దాస్
3) ఎన్.ఎస్. విశ్వనాథన్
4) మహేష్ కుమార్ జైన్
- View Answer
- సమాధానం: 1
27. ఐక్యరాజ్యసమితి ‘వరల్ట్ ఎకనమిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2019’ నివేదిక భారత వృద్ధిని 2020లో ఎంతగా అంచనా వేసింది?
1) 6.5 శాతం
2) 7.0 శాతం
3) 7.1 శాతం
4) 8.1 శాతం
- View Answer
- సమాధానం: 3
28. అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలను ప్రచురించే సంస్థ?
1) ప్రపంచ బ్యాంకు
2) ప్రపంచ వాణిజ్య సంస్థ
3) ఐ.ఎం.ఎఫ్.
4) రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
- View Answer
- సమాధానం: 2
29. ప్రపంచ వాణిజ్య వృద్ధి 2019లో ఎంతగా ఉంటుందని ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల అంచనా వేసింది?
1) 1.2 శాతం
2) 1.5 శాతం
3) 1.8 శాతం
4) 1.9 శాతం
- View Answer
- సమాధానం: 1
30.భారత్ మొత్తం కాఫీ ఉత్పత్తిలో 70 శాతం పైగా కింది ఏ రాష్ర్టం వాటాను కలిగి ఉంది?
1) త్రిపుర
2) కర్ణాటక
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
31.ప్రపంచ టైజం ఇండెక్స్‌ను ప్రచురించేది?
1) ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్
2) హెరిటేజ్ ఫౌండేషన్
3) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
4) ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్
- View Answer
- సమాధానం: 1
32. భారత విదేశీ రుణంలో కింది ఏ కరెన్సీ రూపంలో రుణం అధికంగా ఉంది?
1) యెన్
2) పౌండ్ స్టెర్లింగ్
3) అమెరికా డాలర్
4) రూపాయి
- View Answer
- సమాధానం: 3
33. ప్రస్తుతం రిజర్ ్వ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వను ఎంతగా అంచనా వేశారు?
1) 518 టన్నులు
2) 618 టన్నులు
3) 650 టన్నులు
4) 670 టన్నులు
- View Answer
- సమాధానం: 2
34. ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్‌ను ప్రచురించేది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండి యా
3) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అజర్బైజాన్
- View Answer
- సమాధానం: 1
35. 2019 ఆగస్ట్లోకింది ఏ పరిశ్రమలో వృద్థి రుణాత్మకంగా నమోదైంది?
ఎ. బొగ్గు
బి. ముడి చమురు
సి. సిమెంట్
డి. విద్యుచ్ఛక్తి
1) ఎ మాత్రమే
2) బి, సి మాత్రమే
3) సి మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4