Skip to main content

Inter Exams: ఇంటర్ విద్యార్థుల‌కు అలర్ట్‌.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..

సాక్షి హైదరాబాద్‌: మే నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ts inter public exams instructions
ts inter public exams instructions

కరోనా నిబంధనలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

 ➤ పరీక్ష కేంద్రంలో గాలి, వెలుతురు ఉన్న గదులకు మాత్రమే అనుమతిస్తూ సింగిల్‌ బెంచీ (మూడు ఫీట్లు)కి ఒకరు, పెద్ద బెంచీ (ఐదు ఫీట్లు)కి ఇద్దరు విదార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.  
➤ విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్స్, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. డీహైడ్రేషన్‌ నుంచి రక్షించేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచతున్నారు.  
➤ పరీక్ష కేంద్రంలోని గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తున్నారు. ప్రతి గదిలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ తీరు పర్యవేక్షించనున్నారు.  
➤ విద్యార్థులు పరీక్షే కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లొకేషన్‌ గుర్తింపు ప్రక్రియకు వెసులుబాటు కల్పించారు. రెండు, మూడు రోజుల్లో మొబైల్‌ యాప్‌ వివరాలను బోర్డు అధికారులు ప్రకటించనున్నారు. 

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్​​​​​​​

​​​​​​​ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

ప్రతి 25 మంది విద్యార్థులకు..
✦ గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 3,76,245 మంది పరీక్షకు హజరు కానున్నారు.  
✦ ఇందుకోసం సుమారు 517 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  హైదరాబాద్‌ జిల్లాలో ఫస్టియర్, సెకండియర్లో కలిపి 153,119 మంది, రంగారెడ్డి జిల్లాలో 115,366 మంది, మేడ్చల్‌ జిల్లాలో 1,07,760 మంది పరీక్షలకు హజరు కానున్నారు. 
✦ ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమిస్తున్నారు. సెంటర్‌ ఒకరు చొప్పున డిపార్ట్‌మెంట్‌ అధికారులను, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ప్రైవేటు విద్యా సంస్ధల కేంద్రాలకు అదనంగా అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించారు.\

TSBIE: ఇంటర్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌.. వైద్యుల వ్యక్తిగత నెంబర్‌లు ఇవే..

తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల తేదీలు ఇవే..

ఫస్టియర్‌

తేదీ

పరీక్ష

6–5–22

ద్వితీయ భాష

9–5–22

ఇంగ్లిష్‌

11–5–22

మ్యాథ్‌స్ –1ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

13–5–22

మ్యాథ్‌స్ –1బి, జువాలజీ, హిస్టరీ

16–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

18–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

20–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు–మ్యాథ్‌స్

23–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

సెకండియర్‌

తేదీ

 పరీక్ష

7–5–22

ద్వితీయ భాష

10–5–22

ఇంగ్లిష్‌

12–5–22

మ్యాథ్‌స్ –2ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

14–5–22

మ్యాథ్‌స్ –2బి, జువాలజీ, హిస్టరీ

17–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

19–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

21–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌

24–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

​​​​​​​​​​​

Published date : 30 Apr 2022 07:13PM

Photo Stories