Skip to main content

TSBIE: వారికి ఇంటర్‌ పరీక్ష ఫీజులో మినహాయింపు

సాక్షి, హైదరాబాద్‌: బహుళ అంతస్తుల భవనాల (మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ)లో నడిపే ఇంటర్మీడియెట్‌ కాలేజీల్లోని విద్యార్థులకు పరీక్ష ఫీజులో తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.
TSBIE
వారికి ఇంటర్‌ పరీక్ష ఫీజులో మినహాయింపు

రూ.వెయ్యి ఆలస్య రుసుముకు బదులు రూ.వంద చెల్లిస్తే సరిపోతుందని బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 15 మీటర్ల ఎత్తులో ఉండే బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. 2020 సెప్టెంబర్‌ 24న ప్రభుత్వం ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అలాంటి బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తున్న దాదాపు 400 ప్రైవేటు ఇంటర్‌ కాలే జీలకు ఫైర్‌ సేఫ్టీ అనుమతులు లభించడం కష్టమ వుతోంది. ఇది ఉంటేనే ఇంటర్‌ బోర్డ్‌ అనుబంధ గుర్తింపు ఇస్తుంది. ఈ కారణంగా ప్రతి ఏటా మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీలకు పరీక్షల తేదీ దగ్గరపడుతున్నా అఫ్లియేషన్‌ రావడం లేదు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ప్రతీ ఏటా కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఆ సంవత్సరం వరకూ అనుబంధ గుర్తింపు ఇవ్వడం, వచ్చే ఏడాది ఇవ్వబోమని బోర్డ్‌ అధికారులు చెప్పడం షరామామూలైంది. ఈ సంవత్సరం కూడా 2022–23, 2023–24కు అగ్నిమాపక శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కాలేజీల్లో 15 మినహా అన్నింటికి బోర్డ్‌ అనుబంధ గుర్తింపు ఇచ్చింది. అప్పటికే ఇంటర్‌ పరీక్షఫీజు గడువు ముగిసింది. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది. అనుబంధ గుర్తింపు లేకుండానే విద్యార్థులను చేర్చుకున్న కాలేజీల తప్పిదం వల్ల తాము రూ.వెయ్యి ఆలస్య రుసుం చెల్లించడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డ్‌ దృష్టికి తెచ్చాయి. దీంతో రూ.వంద ఆలస్య రుసుముతో జనవరి 7వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతించింది. 8న విద్యార్థుల ఫీజులను బోర్డ్‌ ఖాతాలో జమ చేయాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.

Published date : 07 Jan 2023 03:12PM

Photo Stories