10th Class & Inter: విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి
మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆమె జనవరి 23న ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక విద్యాబోధన, స్టడీ, రీడింగ్, రైటింగ్ ప్రాక్టీస్ చేయించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి గ్రూపుగా తయారు చేసి చదువులో రాణించేలా చూడాలన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
మెనూ ప్రకారం భోజనం వడ్డీంచాలన్నారు. వంటశాల, స్టోర్‌రూమ్, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం టెన్త్, ఇంటర్ విద్యార్థులతో ఆమె మాట్లాడారు. ఏకాగ్రతతో చదువుకుని పరీక్షలు రాయాలన్నారు. ఉదయం యోగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అరుణ, టీచర్లు రమాదేవి, శ్రీదేవి, స్వరూప, విజయ, హరిత, వరలక్ష్మి, కౌసల్య, స్వరూపరాణి, ప్రశాంతి, లత, అన్నపూర్ణ, సుల్తానా, రామకృష్ణ, అనిత, మమత, శరణ్య, జోత్స్న, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్