Skip to main content

TSBIE: ఇంటర్‌ విద్యార్థులకు రిలయన్స్‌ శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ కోసం రిలయన్స్, ఇంటర్‌ బోర్డ్‌ మధ్య జనవరి 5న అవగాహన ఒప్పందం జరిగింది.
Reliance Training for TS Intermediate Students
ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌

ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు చదివేవారితోపాటు, రెగ్యులర్‌ విద్యార్థులూ ఆసక్తి ఉంటే ఇందులో చేరవచ్చని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు సూచించారు. రిటైల్‌ మార్కెటింగ్‌లో ఆరునెలల కాల పరిమితితో రిలయన్స్‌ ఈ శిక్షణ నిర్వహిస్తుంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ శిక్షణకు ప్రిన్సిపాళ్ల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ సూచించింది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్షణం ఉపాధి అందించే ఉద్దేశంతో ఒకేషనల్‌లో దీన్ని ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. శిక్షణ కాలంలో రిలయన్స్‌ నెలకు రూ. 4వేల ఉపకార వేతనం ఇస్తుందని అధికారులు వివరించారు. మార్కెటింగ్‌లో మెళకువలు, వ్యాపార విధానాలు నేర్పడం ఈ కోర్సు ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చేరువలో మాల్స్, రిటైల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ చొచ్చుకొస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఈ శిక్షణ ఇస్తారు. 

Published date : 06 Jan 2023 01:46PM

Photo Stories