Skip to main content

TSBIE: అనుమతిలేని ఇంటర్‌ కాలేజీ విద్యార్థులకు పరీక్షకు చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: అనుబంధ గుర్తింపు లభించని ప్రైవేటు కాలేజీల్లో చదివిన విద్యార్థులను వివిధ మార్గాల్లో పరీక్షలకు హాజరయ్యేందుకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు అనుమతించింది.
TSBIE
అనుమతిలేని ఇంటర్‌ కాలేజీ విద్యార్థులకు పరీక్షకు చాన్స్‌

మొదటి సంవత్సరం వారిని ప్రైవేటు కాలేజీల ద్వారా, రెండో ఏడాది విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల ద్వారా పరీక్షకు పంపాలని సూచించింది. ఈమేరకు జిల్లా అధికారులకు బోర్డు ఆదేశాలు జారీచేసింది. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీతో పాటు, ఇతర సాంకేతిక అనుమతులు లేని దాదాపు 400 కాలేజీలకు ఈ ఏడాది సకాలంలో బోర్డ్‌ అఫిలియేషన్‌ ఇవ్వలేదు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

అగ్నిమాపక శాఖ ఇటీవల ఇచ్చిన అనుమతి కారణంగా చివరకు గుర్తింపు ఇచ్చారు. ఇందులో 24కాలేజీలకు గుర్తింపు దక్కలేదు. అఫిలియేషన్‌ ఉన్న కాలేజీల నుంచి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా అఫిలియేషన్‌ రాని 24 కాలేజీల్లోని 5 వేల మంది విద్యా ర్థులకు నష్టం కలిగే వీలుందని భావించడంతో ప్రత్యా మ్నాయ మార్గాలను బోర్డు సూచించింది. 

Published date : 07 Jan 2023 03:47PM

Photo Stories