Inter Exams 2022 : ఇంటర్ ప్రశ్నపత్రాల్లో మళ్లీ తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర బుధవారం కూడా కొనసాగింది. అనేక అచ్చు తప్పులు చోటు చేసుకున్నాయి. ఒకదానికి బదులు వేరొకటి ఇచ్చారు. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సులకు సంబంధించిన పరీక్ష మరింత గందరగోళానికి కారణమైంది. ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుండగా... ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రం మాత్రమే ఇచ్చారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థులు ప్రశ్నపత్రం అర్థం కాక గందరగోళపడ్డారు. ఫస్టియర్ రసాయనశాస్త్రం, కామర్స్ ప్రశ్నపత్రాల్లోనూ అనేక తప్పులు దొర్లాయి.
Also read: After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్ హోదా పొందొచ్చు...
తెలుగు మీడియం రసాయన శాస్త్రం ప్రశ్నపత్రంలో గ్రూప్–2ఏ మూలకాలు అని ఇవ్వాల్సి ఉంటే.. గ్రూప్–2 మూలకాలు అని ఇచ్చారు. ఇంగ్లిష్ మీడియంలో 12వ ప్రశ్నలో రిలేషన్íÙప్ అని ఇవ్వాల్సింది పోయి, రిలేషన్ అని ఇచ్చారు. కెమిస్ట్రీలో ధైరోడైనమిక్స్ పదంలో అక్షర దోషాలున్నాయి. ఇదే పేపర్‌లో ఎక్స్‌ప్లెయిన్‌ను తప్పుగా రాశారు. డిఫరెన్సెస్‌కు బదులు డిఫరెన్స్ అని ఇచ్చారు. కెమిస్ట్రీ ఉర్దూ మీడియంలో ఒక సూత్రాన్ని తప్పుగా ఇచ్చారు. కామర్స్ తెలుగు మీడియంలో డెబిట్ చేసిన అని ఇవ్వాల్సింది పోయి, చెల్లించినా అని ఇచ్చారు. ఇదే పేపర్‌లో జానకి అనే పేరును సరిగా ముద్రించలేదు.
Also read: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..