Inter Supplementary: ఫీజు గడువు తేదీ ఇదే..
Sakshi Education
Intermediate Advanced Supplementary ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు.
జూలై 8 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల కంట్రోలర్ జూలై 6న ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించామని, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి ఫీజు తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, జూనియర్ లెక్చరర్లుగా కనీస వేతనంతో పనిచేస్తున్న ఎనిమిది మందిని క్రమబద్ధీకరిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. సర్వీసు క్రమబద్ధం అయిన వారిలో పాండే భూషణ్‌రావు, రవీందర్‌రెడ్డి, గోపాలకృష్ణ, శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మంతెన శ్రీనివాస్ ఉన్నారు.
చదవండి:
Published date : 07 Jul 2022 03:19PM