Intermediate: ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం
విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆయా పరీక్షా కేంద్రాల్లో సైన్స్ ల్యాబ్‌లో పరికరాలతో పాటు రసాయనాలు అందుబాటులో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 34 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ సారి విద్యాశాఖ కొత్తగా ఇంగ్లిష్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఉండనుంది. గత ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ప్రాక్టికల్స్ జరిగితే ఈ ఏడాది 15 రోజులు ముందుగా జరుగుతున్నాయి. దీంతో సమయం తగ్గువగా ఉండడంతో అధ్యాపకులు విద్యార్థులను సిద్ధం చేశారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంతో పాటు ఒకేషనల్ చదువుతున్న విద్యార్థులు ఈ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాల్ టికెట్స్ ఆయా కళాశాల లాగిన్‌లో ఉంటాయి.
ప్రైవేట్ యజమాన్యాలు ఇబ్బందులు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విద్యార్థుల సందేహాల నివృతికి సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్ (9014448538), జి.అబ్బసాయిలు (9490362648) నంబర్లను సంప్రదించవచ్చు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
అధికారుల నియామకం
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా 34 సెంటర్లు ఉండగా 1 ఫ్లైయింగ్ స్య్కాడ్‌లో ఇద్దరు సభ్యులు ఉంటారు. వారిలో ఫిజిక్స్, బయోసైన్స్ నుంచి అధ్యాపకులు నియమించారు. అలాగే తనిఖీలకు గాను పరీక్షల కన్వీనర్ బైరీ శ్రీనివాస్, ఇద్దరు సభ్యులు ఉంటారు.హైపర్ కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా లేదా ఒకరు నామిని, ఆర్‌జేడీ, డీఈబీ, డీఐఈఓ సభ్యులుగా ఉంటారు. ఆయా కళాశాలకు సంబంబంధించి ఒకరు సీఎస్, డీఓలు మొత్తం 28 మంది ఉంటారు.
శని, ఆదివారాల్లోనూ పరీక్షలు
ప్రాక్టికల్స్ పరీక్షలకు గతంలో శని, ఆదివారంలో ఉండేవి కాదు. ఈసారి 1 నుంచి 15 వరకు వరుసగా సెలవు లేకుండా నిర్వహించనున్నారు. రెండో శనివారం, ఆదివారం కూడా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 28 తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో సెలవు లేకుండా ఉంటాయని అధికారులు తెలిపారు.