Department of Education: విద్యాశాఖలో వింత ధోరణి
ఫలితంగా ఒక చోట గెజిటెడ్ హెచ్‌ఎంగా మరో మండలంలో ఎంఈవోగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఎంఈవో ల పోస్టుల భర్తీ విషయంలో సాంకేతిక కారణాలను చూపుతున్న ప్రభుత్వం గెజిటెడ్ హెచ్‌ఎంలకే అదనపు బాధ్యతలను అప్పగించింది. ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఎంఈవోలుగా పని చేస్తున్న గెజిటెడ్ హెచ్‌ఎంలు ఇటీవల బదిలీ అయ్యారు. వారిని పాఠశాల విధుల నుంచి రిలీవ్ చేసినా ఎంఈవో బా ధ్యతల నుంచి తప్పించలేరు. దీంతో విధుల నిర్వ హణ భారంగా మారిందనే వాదన వినిపిస్తుంది.
చదవండి: Telangana: మినీ అంగన్‌వాడీలకు మహర్దశ
మాక్లూర్ మండల ఎంఈవోగా పని చేస్తున్న రాజ గంగారెడ్డి కామారెడ్డి జిల్లా భిక్కునూర్ హెచ్‌ఎంగా బదిలీ అయ్యారు. ఆయన అక్కడ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ దాదాపు 90 కి.మీ దూరంలో ఉన్న మాక్లూర్ ఎంఈవోగా అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. ఇది ఎలా సాధ్యమైతుందనే సంశయం వ్యక్తమైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు నోరుమెదపక పోవడం గమనార్హం. అలాగే నందిపేట్ ఎంఈవోగా కొనసాగుతున్న శ్రీనివాస్‌రెడ్డి జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్‌ఎంగా బదిలీ అయ్యారు.
వేల్పూర్ ఎంఈవోగా పని చేస్తున్న వనజ అంక్సాపూర్ ఉన్న త పాఠశాల నుంచి ఆర్మూర్ బాలికల ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్‌ఎంగా బాధ్యతలను చేపట్టారు. ఆమె ఇక్కడ విధులు నిర్వహిస్తూనే వేల్పూర్ మండలంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.