Skip to main content

Tenth Exams 2024 : పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించాలి.......

Tenth Exams 2024 : పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించాలి.......
Tenth Exams 2024 - పదో తరగతి లో  ఉత్తమ ఫలితాలు సాధించాలి.......
Tenth Exams 2024 - పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించాలి.......

బేల: పదో తరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని డీఈవో ప్రణీత సూచించారు. గురువారం సిర్సన్న గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో కొనసాగుతున్న తెలుగు స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. దీంతో పాటు బేలలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బేలలోని కేజీబీవీతో పాటు ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పలు రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో సిలబస్‌పై మాట్లాడి, పుస్తక పాఠ్యాంశాలను చదివించి అభ్యసన స్థాయిపై ఆరా తీశారు.

Also Read :  Biology Study Material 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు స్పష్టమైన ఉచ్ఛరణ, దారాళంగా చదవడం, దోషాలు లేకుండా రాయడం వచ్చినప్పుడే తెలుగు భాషలో పట్టుసాధిస్తారని తెలిపారు. తద్వారా మిగతా సబెక్టులను సులభంగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. సబెక్టుల పరంగా సందేహాలుంటే ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయులు కోల సర్సింలు, మహాలక్ష్మి, డీఆర్పీ చరణ్‌దాస్‌, కేజీబీవీ ప్రత్యేకాధికారి గేడాం నవీన, సీఆర్పీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Published date : 05 Jan 2024 01:20PM

Photo Stories