School Admissions: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Sakshi Education
నల్లగొండ : తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2024–25 సంవత్సరానికి 6 నుంచి 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థులు మార్చి 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి మార్చి 4న ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తులను telanganams. cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 1న హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 7న ఉదయం 6వ తరగతికి, మధ్యాహ్నం ఆపై తరగతులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
చదవండి: AI-Generated Robot Teacher: స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు ! అచ్చం టీచర్ మాదిరిగానే..!
జనరల్ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.
Published date : 05 Mar 2024 04:56PM